• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండీ టాక్: షాకిచ్చిన...

ట్రెండీ టాక్: షాకిచ్చిన RRR విదేశీ హక్కులు

By - Tupaki Desk
Update: 2021-01-26 04:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ నెమ్మ‌దిగా శాంతిస్తుండ‌డం మార్కెట్ పై ఆశావ‌హ ధృక్ప‌థం పెంచుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న ప‌రిస్థితి నేడు లేదు. నేటి స్థితి రేపు ఉండ‌దు. అందుకేనేమో.. ప్ర‌తిష్ఠాత్మ‌క పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ బిజినెస్ కి హైప్ పెరిగింది.

ఎస్.ఎస్. రాజమౌళి విడుదల తేదీని ఖ‌రారు చేయ‌డంతో  ప్రీ-రిలీజ్ బిజినెస్ కి ఒక్క‌సారిగా రెక్క‌లొచ్చాయ‌ని చెబుతున్నారు. 2020-21 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ గురించిన ఆస‌క్తి మార్కెట్ వ‌ర్గాల్లో ఉంది. అక్టోబర్ 13 న దసరా కానుక‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. పండ‌గ ఫ‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ఆద‌ర‌ణ ఆ స్థాయిలోనే ఉంటుంద‌ని జ‌క్క‌న్న అండ్ టీమ్ అంచ‌నా వేస్తున్నారు. ట్రేడ్ కూడా దీనిని న‌మ్ముతోంది. తెలుగు రాష్ట్రాల సంగ‌తి అటుంచితే విదేశాల్లో స‌న్నివేశ‌మేమిటి? అన్న‌ది ఆలోచిస్తే ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి.

క‌రోనా క్రైసిస్ తో అమెరికా అల్లాడిపోతున్న వేళ టాలీవుడ్ కి మ‌రో నైజాం అయిన‌ అగ్ర రాజ్య మార్కెట్ ఏమ‌వుతుందోన‌న్న ఆందోళ‌న టాలీవుడ్ కి కునుకు ప‌ట్ట‌నివ్వ‌లేదు. కానీ ఇప్పుడు నెమ్మ‌దిగా అక్క‌డా ప‌రిస్థితులు చ‌క్క‌బడుతున్నాయి. అమెరికాలో COVID రెండవ వేవ్ ఎక్కువ కాలం ఉండ‌దు. అక్టోబ‌ర్ నాటికి ప‌రిస్థితి అదుపులోకి వ‌స్తుంద‌న్న అంచ‌నా ఉంది. అందుకే రాజమౌళి ధైర్యం చేసి సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు.

ఆయ‌న రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణం అమెరికా రిలీజ్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయ‌ని తెలుస్తోంది. తెలుగు -తమిళ వెర్ష‌న్ల‌ విదేశీ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ కు 68 కోట్లకు విక్ర‌యించార‌ని తెలిసింది. ఇదే సంస్థ ఇంత‌కుముందు సాహో విదేశీ హ‌క్కుల్ని ఛేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిన‌దే.

బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి వేవ్ ఆర్.ఆర్.ఆర్ తో తేగ‌ల‌న‌నే రాజ‌మౌళి న‌మ్ముతున్నారు. రామ్ చ‌ర‌ణ్ - రామారావు స్టామినాని ఆయ‌న పూర్తిగా న‌మ్మి ముందుకెళుతున్నారు. మ‌రి అంతిమ ఫ‌లితం ఏమవుతుందో చూడాలి.
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS