ట్రెండీ టాక్: ఫ్యాబ్యుల‌స్ లివ్స్ ఆఫ్ టాలీవుడ్ వైవ్స్

Update: 2021-09-03 10:30 GMT
ఫ్యాబ్యుల‌స్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ .. షో నెట్ ఫ్లిక్స్ లో విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. చూస్తుంటే అలాంటి ఒక సీజ‌న్ టాలీవుడ్ లోనూ ప్రారంభించేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని అనిపిస్తోంది. ముంబై ప‌రిశ్ర‌మ‌తో పోలిస్తే ఇంకా హైద‌రాబాద్ సెల‌బ్రిటీ వైవ్స్ దూకుడు మ‌రీ అంత ఎక్కువ‌గా ఫోక‌స్ కాక‌పోయినా... ఇక్క‌డా చిల్లింగ్ యాటిట్యూడ్ కి కొద‌వేమీ లేద‌ని చాలా ఈవెంట్లు నిరూపిస్తున్నాయి.

టాలీవుడ్ లో ఫేజ్ 3 సెల‌బ్రిటీ వైవ్స్ గురువారం రాత్రి డిన్నర్ కి వెళ్లారు. ప్రముఖ నటి .. టెలివిజన్ హోస్ట్ లక్ష్మీ మంచు.. స్టార్ హీరోయిన్ శ్రీ‌యశ‌రన్.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మ‌రికొంద‌రు స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. లక్ష్మీ మంచు ఈ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ``నిన్నటి రాత్రి గురించి`` అంటూ లక్ష్మి క్యాప్షన్ ఇచ్చారు. దీనికి అభిమానుల నుంచి అంతే అద్భుత స్పంద‌న ద‌క్కింది.

నిన్న లేదు నేడు లేదు ఎప్పుడైనా ఎంజాయ్ చేసేద్దాం! అంటూ యూత్ ఫిదా చిలౌట్ అవుతున్నారు. ఇక ఈ ఫోటోలో స్టార్ వైవ్స్ అంతా స‌ర‌దాగా న‌వ్వులు చిందిస్తూ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ల‌క్ష్మీ ఎంతో యాక్టివ్ గా ఉండే యాంక‌ర్. త‌న‌కు ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ని స‌త్సంబంధాలున్నాయి. స్టార్లంద‌రితోనూ ఎంతో స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. అందుకే ఈ స్పెష‌ల్ వీకెండ్ పార్టీ ఎంతో స్పెష‌ల్ గా కుదిరింది. విదేశీ క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చీవ్ ను వివాహం చేసుకున్న తర్వాత బార్సిలోనాలో స్థిరపడిన శ్రియ ఇటీవ‌ల ముంబైలో స్థిర‌పడింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌స్తుతం శ్రీ‌య టాలీవుడ్ బాలీవుడ్ పై ఫోక‌స్ చేసింది. ఇక అల్లు స్నేహారెడ్డి అరుదుగా పార్టీలు వేడుక‌ల్లో క‌నిపిస్తుంటారు. ఇటీవ‌ల శాకుంత‌లం సెట్లో అల్లు అర్హ‌తో పాటు క‌నిపించారు. మంచు లక్ష్మి ప్రస్తుతం ఆహా వంట కార్యక్రమం `ఆహ భోజనంబు`తో బిజీగా ఉన్నారు. త‌న కిడ్స్ తో స‌ర‌దా ఆట‌పాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తూ ఆ ఫోటోలు వీడియోల‌ను మంచు ల‌క్ష్మీ ఇన్ స్టాలో షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఫ్యాబ్యుల‌స్ లైవ్స్ ఆఫ్ టాలీవుడ్ వైవ్స్ ఒక స్ఫూర్తి..

బాలీవుడ్ ఫేజ్ 3 సెల‌బ్రిటీల జీవితాలపై సెటైరిక‌ల్ సినిమాలు తీయ‌డంలో మ‌ధుర్ భండార్క‌ర్ లాంటి జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌కు కొత్తేమీ కాదు కానీ.. అదే త‌ర‌హాలో నెట్ ఫ్లిక్స్ రియాలిటీ టీవీ షో ఒక‌టి హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ వైఫ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్టుతో రూపొందించిన బాలీవుడ్ వైఫ్స్ సీజ‌న్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. న‌లుగురు స్టార్ హీరోల భార్య‌ల లైఫ్ స్టైల్ ఇదీ .. ఇలా ఉంటుంది! అంటూ ఇందులో చూపించారు. వైవ్స్ లోని ఫ‌న్ ఎమోష‌న్ లైఫ్ జ‌ర్నీ ప్ర‌తిదీ సెటైరిక‌ల్ గా ఎలివేట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

కింగ్ ఖాన్ షారూక్ వైఫ్ గౌరీఖాన్ ఈ షోకి ప్ర‌చారం చేయించ‌డం ఆస‌క్తిక‌రం. అలాగే ఆ న‌లుగురు భార్య‌ల్లో ఒక‌రు గౌరీఖాన్ కూడా ఉన్నారు. భార్య‌లు షాపింగ్ కి వెళితే.. కార్ చికాకు పెడితే .. రోడ్ లో వ‌య్యారంగా న‌డుస్తుంటే.. ల‌గ్జ‌రీ కార్ లోంచి దిగుతుంటే.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేస్తుంటే.. ఇలా ర‌క‌రకాల యాంగిల్స్ లో భార్యామ‌ణుల్ని స్ట‌డీ చేసి అవ‌న్నీ ఎలా ఉంటాయో ఫ‌న్నీ గా చూపించారు. అంతేకాదు స్టార్ వైఫ్స్ కి లైనేసే కుర్ర‌హీరోని కూడా ఇందులో చూపించిన తీరు ఎంతో రొమాంటిక్ గా అల‌రించింది. అయితే ఈ సిరీస్ ఒరిజినాలిటీకి దూరంగా లేకుండా తెర‌కెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ టీవీ షో ఫ్యాబ్యుల‌స్ లివ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్.. ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్ ..మహీప్ కపూర్- నీలం కొఠారి సోని- సీమా ఖాన్- భవానా పాండే న‌టీమ‌ణులుగా క‌నిపిస్తున్నారు. ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్‌ బెవర్లీ హిల్స్ ... కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్.. సెక్స్ అండ్ ది సిటీ లాంటి హాలీవుడ్ షోస్ స్ఫూర్తితో రూపొందింది. ఈ నలుగురు న‌టీమ‌ణులు టాబ్లాయిడ్లు ప్రముఖ సోషల్ మీడియా పోస్టులలో బాగా పాపుల‌ర‌య్యారు. మహీప్- సీమా- భ‌వన నిర్మాణ‌ అసోసియేషన్ ద్వారా ప్రసిద్ది చెందగా.. నీలం గోవింద.. చంకీ పాండే సరసన పలు చిత్రాలలో నటించారు. ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ టాప్ హీరోల వైవ్స్ తో రియాలిటీ షోని ప్లాన్ చేస్తారేమో చూడాలి.



Tags:    

Similar News