ట్రైలర్ టాక్ : సూపర్ స్టార్ ‘బేతాల్’ సూపర్
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. నెట్ ప్లిక్స్.. అమెజాన్ ఇంకా పలు ఓటీటీ సంస్థలు భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఓటీటీ బిజినెస్ పెరుగుతోంది. అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికే థియేటర్ల బిజినెస్ ను మించి ఓటీటీ బిజినెస్ పెరిగి పోయింది. అద్బుతమైన విజువల్స్ తో ఓటీటీ లో వెబ్ సిరీస్ లు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా నెట్ ప్లిక్స్ లో వచ్చే వెబ్ సిరీస్ లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి నెట్ ప్లిక్స్ ‘బేతాల్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. సాదారణంగా షారుఖ్ మూవీ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్ కు ఆయన నిర్మాత అవ్వడం వల్ల దీనికి కూడా అంతే స్థాయిలో ప్రేక్షకులు రెస్పాండ్ అవుతున్నారు. ఈనెల 24న నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతున్న హర్రర్ సస్పెన్స్ థ్లిర్ బేతాల్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. హాలీవుడ్ సినిమా స్థాయిలో విజువల్స్ ఉన్నాయి. 18వ శతాబ్దంకు సంబంధించి ఆర్మీ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది. అత్యంత భయంకరమైన సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటేనే అనిపిస్తుంది. ట్రైలర్ తో అంచనాలు పెంచారు. ప్రస్తుతం బేతాల్ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఈమద్య హీరోగా సక్సెస్ లు దక్కించుకోలేక పోయాడు. మరి ఈ వెబ్ సిరీస్ తో అయినా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
Full View