• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: ఆసక్తి...

ట్రైలర్ టాక్: ఆసక్తి రేకెత్తిస్తోన్న 'క‌థ కంచికి మ‌నం ఇంటికి'

By - Tupaki Desk
Update: 2022-02-23 07:32 GMT
వైవిధ్యమైన సినిమాలతో సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అదిత్ అరుణ్. ఇప్పుడు తన పేరుని త్రిగుణ్ గా మార్చుకుని ''క‌థ కంచికి మ‌నం ఇంటికి'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టైటిల్ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

'తాతయ్యా.. లెక్కలేనన్ని ఆస్తులిచ్చావ్.. ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఇచ్చావ్.. మన కుటుంబ గౌరవాన్ని కాపాడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, నీ మునిమనవడికి నీ పేరు పెట్టుకొని నీ ఋణం తీరుస్తా.. ఇది నా ఛాలెంజ్' అని అదిత్ అరుణ్ చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన జీవితంలో ప్రేమ లేదని బాధ పడే ప్రేమ్.. ఎలాగైనా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి.

ఈ క్రమంలో పూజిత పొన్నాడతో ఆదిత్ ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. ఫన్నీగా సాగిన ఈ ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ జోడించబడ్డాయి. హీరో అండ్ టీం ఓ హాంటెడ్ హౌస్ లో చిక్కుకుపోవడం.. అక్కడ ఓ దెయ్యం వారిని ముప్పుతిప్పలు పెట్టడం వంటివి చూపించారు. అయితే పితృ దేవతలు చేసిన పాపాలు ఆదిత్ జీవితంలో శాపాలుగా మారాయని తెలుస్తోంది. ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఆత్మలన్నీ ఆది పరాశక్తులై వస్తాయని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.

అసలు ఈ కథేంటి? అది కంచికి చేరిందా లేదా? అనేది తెలియాలంటే 'క‌థ కంచికి మ‌నం ఇంటికి' సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇందులో మహేష్ మంజ్రేకర్ - సప్తగిరి - వినోద్ కుమార్ - శ్యామల - హేమంత్ - గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ - కెమెరా పనితనం - వీఎఫ్ఎక్స్ వర్క్స్ బాగున్నాయి. ఇది హారర్ అంశాలతో కూడిన క‌మ‌ర్షియ‌ల్ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.

కొరియోగ్రాఫర్ చాణక్య చిన్న ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఎమ్.పి. ఆర్ట్స్ బ్యానర్‌ పై మోనిష్ పత్తిపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేసారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ''క‌థ కంచికి మ‌నం ఇంటికి'' విడుదలకు సిద్ధమైంది. 2022 మార్చి 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Full View
Tags:    
  • Kathakanchikimanamintiki 
  • trailer 
  • adithyaarun 
  • trigun 
  • poojithapandey 
  • latestnews 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS