• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: ఆసక్తి...

ట్రైలర్ టాక్: ఆసక్తి కలిగిస్తున్న 'అలాంటి సిత్రాలు'

By - Tupaki Desk
Update: 2021-03-24 08:18 GMT
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద రచనా విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న సినిమా ''అలాంటి సిత్రాలు''. కె రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఐ &ఐ ఆర్ట్స్ మరియు కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శ్రీ వరుణ్ - రాహుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా ఫస్ట్ లుక్ - టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా “అలాంటి సిత్రాలు” ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే విభిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు కలిసినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలే ఈ సినిమా అని తెలుస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ ఈ ట్రైలర్ తో కంటెంట్ విషయంలో పెద్ద చిత్రమని అర్థం అవుతోంది. 'మనం బ్రతకడానికి ఏ పని చేసినా తప్పులేదు.. ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడ ఎవరూ కరెక్ట్ కాదు.. ఎవడి వ్యభిచారం వాడు చేస్తున్నాడు' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ కథకు మెట్రో ట్రైన్ లో జర్నీకి లింక్ చేస్తూ కథనం ఉన్నట్లు తెలుస్తోంది.

బోల్డ్ సన్నివేశాలు - భావోద్వేగాలతో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. 'అలాంటి సిత్రాలు' చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందించగా.. కార్తీక్ సాయి కుమార్ కెమెరామెన్ గా వ్యవహరించాడు. అస్వంత్ శివ కుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. శ్వేతా పరాశర్ - యాష్ పురి - అజయ్ కతుర్వార్ - ప్రవీణ్ యండమూరి - తన్వీ ఆకాంక్ష - రవి వర్మ - దయానంద్ రెడ్డి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Full View

Tags:    
  • Alanti Sitralu 
  • Telugu Movie Official Trailer 
  • Supreeth C Krishna 
  • Rahul Reddy 
  • Raghavendra Reddy 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

గాయత్రీ మంత్రం పఠించిన మాల్తీ మేరీ.. విదేశాల్లోను భార‌తీయ‌త మ‌న స్టార్ల‌ ప్ర‌త్యేక‌త‌!

2026-11-19 20:58 GMT

Copyright @2026

Powered by Blink CMS