టాప్ స్టోరి: టాలీవుడ్ షూటింగులు వాట్ నెక్ట్స్?

Update: 2020-10-20 04:00 GMT
కోవిడ్ మ‌హ‌మ్మారీ ఎంతో విలువైన ఏడెనిమిది నెల‌ల కాలాన్ని హ‌రించింది. ముఖ్యంగా టాలీవుడ్ బిగ్ ప్లాన్స్ కి హోప్ కి అన్ని ర‌కాలుగా చెక్ పెట్టేసింది. క‌నీసం ఇప్ప‌టికి అయినా రిలీఫ్ ఇచ్చిందా? అంటే.. అస‌లు అంతూ ద‌రీ లేని వ్యాక్సిన్ వ‌స్తుందో రాదో తెలీని గంద‌ర‌గోళ స‌న్నివేశ‌మే ఇంకా క‌నిపిస్తోంది. అయితే ఇటీవ‌ల కొంద‌రు డేర్ చేసి షూటింగులు ప్రారంభించారు. మ‌రికొంద‌రు సినిమాలకు స్క్రిప్టులు ఫైన‌ల్ చేసుకుని షూటింగులు మొద‌లెట్టాలా లేదా అంటూ ఇంకా డైల‌మాలోనే ఉన్నారు. అన్ లాక్ 5.0లో షూటింగుల‌కు వెసులుబాటు క‌ల్పించినా ఇంకా ఎందుకీ తాత్సారం అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల మ‌న స్టార్ హీరోలంతా వ‌రుస‌గా భారీ ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించారు. యువ‌హీరోలు కూడా ప‌లు స్క్రిప్టుల‌ను ఫైన‌ల్ చేసుకుని ఇక సెట్స్ కెళ్లిపోయేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప‌లువురు హీరోలు ఆన్ సెట్స్ ఎంతో కేర్ తీసుకుంటూ షూటింగుల్లో పాల్గొంటున్నా కొంద‌రు మాత్రం ఇంకా సంశ‌యంతో హోల్డ్ లోనే ఉంచారు. వీళ్ల‌లో చిరంజీవి.. మ‌హేష్ త్వ‌ర‌లోనే సెట్స్ కెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. ప్ర‌భాస్.. రామ్ చ‌ర‌ణ్‌.. శ‌ర్వానంద్.. నితిన్ .. అఖిల్ ఇలా హీరోలంతా వ‌రుస‌గా కొత్త‌ సినిమాల్ని ప్ర‌క‌టించి ప‌ట్టాలెక్కించే ప‌నుల్లో ఉన్నారు. ఆల్రెడీ పెండింగ్ వ‌ర్క్స్ లో ఉన్న‌వి పూర్తి చేసుకుని కొత్త సినిమాల్ని వీళ్లంతా ప‌ట్టాలెక్కించాల్సి ఉంటుంది.  అఖిల్ నితిన్ ఇటీవ‌ల త‌మ సినిమాల పెండింగ్ షూట్స్ పూర్తి చేసి త‌దుప‌రి చిత్రాల షెడ్యూల్ పైనా దృష్టి సారించారు.

డార్లింగ్ ప్ర‌భాస్  ఒకేసారి రెండు సినిమాల‌ను ప్ర‌క‌టించారు. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ సినిమా.. అలానే ఓం రౌత్ తో ఆదిపురుష్ 3డి సినిమాల్లో న‌టించేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి ఉంది. రాధేశ్యామ్ పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల్సి ఉంది ప్ర‌భాస్. అఖిల్- సురేందర్ రెడ్డి మూవీ.. శర్వానంద్ మహాసముద్రం.. నితిన్ అంధాధున్ రీమేక్ .. నాగ శౌర్య మూవీ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కాల్సి ఉంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ క్రాక్ త‌ర్వాత ఖిలాడీ చిత్రంలో న‌టించాల్సి ఉంది. అయితే వీళ్లంద‌రూ కొత్త సినిమాల షెడ్యూల్స్ పై ఇంకా క్లారిటీని ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవ‌ల థియేట‌ర్ల‌ను ఓపెన్ చేసినా జ‌నంలో స్పంద‌న లేక‌పోవ‌డం నిరాశ‌ను క‌లిగించింది. అయితే ఈ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చేందుకు కొంత‌కాలం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వ్యాక్సినో టీకానో అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్పుడే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు. ఇక షూటింగుల ప‌రంగా కూడా మ‌రింత‌ స్పీడ్ పెంచేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. మ‌రి ఆ శుభ‌ఘ‌డియ ఎప్ప‌టికి వ‌చ్చేనో!
Tags:    

Similar News