సమంత మరో గ్రేట్ రికార్డ్.. టాప్ 4లో ఇలా..

మరో వైపు ఆమె పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం అంటూ కొత్త సినిమాని ఎనౌన్స్ చేసింది.

Update: 2024-04-30 13:22 GMT

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు హిందీలో సమంత లీడ్ రోల్ లో చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. మరో వైపు ఆమె పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి బంగారం అంటూ కొత్త సినిమాని ఎనౌన్స్ చేసింది. ఈ మూవీతో సమంత నిర్మాతగా కూడా ప్రయాణం స్టార్ట్ చేస్తోంది.

కరోనా తర్వాత విడాకులు, అదే సమయంలో మాయోసైటిస్ బారిన పడటంతో సమంత రెండేళ్ల పాటు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంది. వాటి నుంచి కోలుకొని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోషూట్ లతో సమంత సందడి చేస్తోంది. సౌత్ ఇండియా బ్యూటీస్ లో అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న అందాల భామ సమంత కావడం విశేషం.

ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో 34.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో సమంత పెట్టే ఫోటోలు, వీడియోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఐఎండిబి అత్యంత ప్రజాధారణ కలిగిన ఇండియన్ హీరోయిన్స్ జాబితాని ప్రకటించింది. ఈ జాబితాలో సమంత టాప్ 4 లో ఉండటం విశేషం.

దీనిని బట్టి దేశ వ్యాప్తంగా సమంతకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అంచనా వేయవచ్చు. సమంత కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే సినిమాలు చేసింది. అయితే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా సమంత అందరికి రీచ్ అయ్యింది. అందులో ఆమె పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ వెబ్ సిరీస్ సమంతకి నార్త్ లో కూడా విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది.

సిటాడెల్ తో సమంత ఇమేజ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఐఎండిబి నిర్వహించిన ఓటింగ్ ద్వారా అత్యంత ప్రభావవంతమైన భారతీయ నటీమణుల జాబితాలో టాప్ 4లో సమంత నిలిచింది. మాయోసైటిస్ ని ఎంతో ధైర్యంగా ఆమె జయించి ఆదర్శంగా నిలిచింది. అలాగే ఇండిపెండెంట్ విమెన్ గా ఆమె ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిగా నిలుస్తూ మెజారిటీ ఓటింగ్ ని తెచ్చుకుంది. దీంతో టాప్ 4గా సమంత నిలిచింది.

Tags:    

Similar News