ISL సెమీ ఫైనల్‌.. టీమ్ విక్ట‌రీతో ఆలియా జోష్‌

తన ఫుట్‌బాల్ జట్టు 'ముంబై సిటీ ఎఫ్‌సి' గేమ్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకోవడంతో ర‌ణ‌బీర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Update: 2024-04-30 14:45 GMT

అలియా భట్ - రణబీర్ కపూర్ ISL సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆన్‌లైన్ లో చాలా బ‌జ్ సృష్టించింది. ముఖ్యంగా కపూర్ టీమ్ గెలిచాక‌ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్న ర‌ణ‌బీర్ - ఆలియా జంట‌ ఫోటో ఆన్‌లైన్‌లోకి రాగానే, క్రీడా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.


ముంబై సిటీ FC వ‌ర్సెస్ FC గోవా మధ్య జరిగిన ISL (ఇండియన్ సూపర్ లీగ్) సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ర‌ణ‌బీర్ కపూర్ - అలియా భట్ హాజరవ్వ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది. తన ఫుట్‌బాల్ జట్టు `ముంబై సిటీ ఎఫ్‌సి` గేమ్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకోవడంతో ర‌ణ‌బీర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఫుట్‌బాల్ ఏరియాలో రణ్‌బీర్ - అలియా విక్టరీని సెల‌బ్రేట్ చేసుకున్నారు. తమ అభిమానులతో కలిసి ఈ విజయానికి సంబరాలు చేసుకున్నారు. ఈ జంట అభిమానులతో కలిసి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నిజానికి రణబీర్ కపూర్ ఫుట్‌బాల్ కి వీరాభిమాని కావడంతో తరచూ మ్యాచ్‌లకు హాజరవుతూ ఉంటాడు. అలియా భట్ ఒక్కోసారి అతడితో కలిసి క‌నిపిస్తుంది. ఇప్పుడు ఒక టీమ్ కి య‌జ‌మానిగా విజ‌యాల‌ను సెల‌బ్రేట్ చేస్కుంటున్నాడు క‌పూర్ బోయ్.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రణబీర్ చివరిసారిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా `యానిమల్`లో కనిపించాడు. ఈ చిత్రం అత‌డికి సిస‌లైన పాన్ ఇండియా విజ‌యంగా నిలిచింది. యానిమ‌ల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు పైగా వ‌సూలు చేసింది. అత‌డు ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో `రామాయణం` షూటింగ్‌లో ఉన్నాడు. ఇటీవల షూటింగ్ స్పాట్ నుండి రణబీర్ - సాయి పల్లవి జంట‌కు సంబంధించిన‌ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి

అలియా భట్ తన త‌దుప‌రి చిత్రం `జిగ్రా` విడుదల ప్ర‌మోష‌న్స్ కి సిద్ధమవుతోంది. రణబీర్ కపూర్ - విక్కీ కౌశల్‌లతో సంజయ్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించ‌నున్న `లవ్ అండ్ వార్`లోను ఆలియా న‌టించ‌నుంది.

Tags:    

Similar News