• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరుగురు హీరోయిన్లు.. అలా...

ఆరుగురు హీరోయిన్లు.. అలా అనేశారు

By - Tupaki Desk
Update: 2016-10-02 22:30 GMT
టాలీవుడ్ కి బోలెడంత ఘనకీర్తి ఉంది. అంతటి విస్తృతమైన పరిధి లేకపోయినా.. బాలీవుడ్ తర్వాత అంతటి మార్కెట్ టాలీవుడ్. సల్మాన్.. అమీర్ లాంటి టాప్ హీరోలు దేశవ్యాప్తంగా వసూలు చేసే తొలి రోజు వసూళ్లను మొత్తాన్ని.. మన స్టార్లు కేవలం తెలుగు రాష్ట్ట్రాల నుంచే సాధించేయగలరంటే.. టాలీవుడ్ రేంజ్ అర్ధమవుతుంది. కానీ హీరోయిన్ల విషయంలో మనకున్నంత బ్యాడ్ నేమ్ మరే ఇండస్ట్రీకి లేదు. ఆఖరికి సెమీ పోర్న్ సినిమాలు తీసే భాషల్లో హీరోయిన్స్ కి కూడా ఓపెన్ గా ఇండస్ట్రీని విమర్శించరు.

తాప్సీ పన్ను: పింక్ తో ఓ రేంజ్ కి చేరుకున్న తాప్సీ.. టాలీవుడ్ ద్వారానే హీరోయిన్ అయింది. అయితే.. ఇక్కడున్నన్నాళ్లూ ఈమెకు చుక్కలు చూపించేశారని చెప్పింది. టైమ్ కి డబ్బులు ఇవ్వకపోవడం, ఇష్టం వచ్చినట్లు షూటింగ్ క్యాన్సిల్ చేయడం లాంటివి చాలానే జరిగాయి. ప్రస్తుతం చేస్తున్న బైలింగ్యువల్ ఘాజీ తప్ప.. మరో తెలుగు సినిమా అంగీకరించేందుకు ఈమె సిద్ధంగా లేదని అంటున్నారు.

రాధికా ఆప్టే: తెలుగు హీరోలు ఫుల్లు ఇన్ సెక్యూర్ అని.. అందుకే తమ ట్యాలెంట్ ప్రకారం యాక్టింగ్ చేసే అవకాశం కూడా ఉండడం లేదని.. రాధికా ఆప్టే ఓపెన్ గానే రెండు సార్లు చెప్పేసింది.

సమంత : ఈ ఏడాది ఇప్పటికి వరసగా నాలుగు హిట్స్ కొట్టిన సమంత.. తన ట్యాలెంట్ కి తగ్గ రోల్స్ ఎవరూ ఆఫర్ చేయకపోవడంతోనే.. కొత్త సినిమాలు సైన్ చేయడం లేదని చెప్పింది.

జెనీలియా డిసౌజా: పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకుని.. రీ ఎంట్రీ కోసం రెడీ అయిన ఈ భామ.. టాలీవుడ్ లో చాలామందికి పెద్ద పార్టీ ఇచ్చింది. అయితే.. ఈమెకు పెళ్లయిన భామ అనే కారణంతో  సినిమా ఎవరూ ఆఫర్ చేయలేదనే విషయాన్ని గమనించాలి.

చార్మీ కౌర్ : ఓ సినిమా మీద కాకపోయినా.. కనీసం ఓ సీన్ గురించి అయినా.. హీరోయిన్స్ చెప్పే సజెషన్స్ ని డైరెక్టర్లు స్వీకరించరు సరికదా విమర్శిస్తారని.. చార్మీ కౌర్ వాపోయింది.

ప్రియమణి :  సౌత్ లోని నాలుగు భాషల్లోనూ నటించిన ప్రియమణి.. తెలుగులో తనకు ఆఫర్స్ అంతగా రాకపోవడంపై అసహనం చూపేది. ఒక్క రాజమౌళి మినహాయిస్తే.. నటనకు అవకాశం ఉండే రోల్ తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని ఓసారి చెప్పింది ప్రియమణి.

వీరి గోడంతా వింటుంటే.. మనోళ్లు హీరోయిన్లకు ఎంత వాల్యూ ఇస్తారో అర్ధం కావడం లేదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Top Heroines 
  • Movie Offers 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS