విలేక‌రి వృత్తిలో అగ్ర క‌థానాయిక‌లు..!

Update: 2021-05-06 06:04 GMT
ఇటీవలి కాలంలో చాలా మంది నటీమణులు ఎక్కువగా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్న ఒకే ఒక స్పెష‌ల్ రోల్ ... జర్నలిస్ట్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమన్నా- నయనతార- పార్వతి మెల్టన్- తాప్సీ పన్నూ- సుమన్ రంగనాథన్ విలేకరులుగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు. అమలా పాల్- కృతి సనోన్- చార్మి- హన్సిక మోత్వానీ- కావ్య శెట్టి వంటి మరికొందరు భామ‌లు జర్నలిస్ట్ గెటప్ లో కనిపించారు.

మ‌హాన‌టిలో మ‌ధుర‌వాణి అనే అమాయ‌క జ‌ర్న‌లిస్టుగా స‌మంత అభిన‌యం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇటీవ‌లే ది బిగ్ బుల్ వెబ్ సినిమాలో ఇలియానా ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిస్టుగా న‌టించింది. తాజాగా ఈ జాబితాలో అవికాగోర్ చేరింది. `అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌1`లో అవిక జ‌ర్న‌లిస్టుగా నటిస్తోంది. ఆది హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బల్ వీర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తెరపై జర్నలిస్టులుగా మారిన మరో ప‌ది మంది క‌థానాయిక‌ల వివ‌రాల్ని ప‌రిశీలిస్తే.. పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా టీవీ రిపోర్టర్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆ పాత్ర చాలా ముఖ్యమైనది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమాజంలో పరివర్తన తీసుకురావడానికి హీరోకి సహాయం చేస్తుంది.

క్రిష్ తెర‌కెక్కించిన‌ కృష్ణమ్ వందే జగద్గురుంలో నయ‌న‌తార‌ ఫోటో జర్నలిస్టుగా నటించింది. రానా దగ్గుబాటి ఇందులో హీరో. ఈ చిత్రంలో బళ్లారిలో అక్రమ మైనింగ్ వ్య‌వ‌హారాల్ని వెలికి తీయడానికి ప్ర‌య‌త్నించే హీరోకి న‌య‌న్ సహాయం చేస్తుంది.

నందమూరి బాలకృష్ణ శ్రీమన్నారాయణలో స్వాప్నికా అనే రిపోర్టర్ గా పార్వ‌తి మెల్ట‌న్ కనిపించారు. ఆమె నటనపై సినీ విమర్శకులు మండిపడ్డారు.

నిజ జీవితంలో జర్నలిస్ట్ అవ్వాలనుకున్న తాప్సీ పన్నూ ఆరంభంలో జ‌ర్న‌లిస్టుగా న‌టించారు. అజిత్-విష్ణువర్ధన్ కాంబినేష‌న్ మూవీ ఇది. హంసిక మోత్వానీ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన బిరియానీలో టెలివిజన్ రిపోర్టర్ గా నటించింది. తనకు జర్నలిస్ట్ పట్ల ఎంతో గౌరవం ఉందని రిపోర్టర్ పాత్ర పోషించిన తర్వాత వారి పట్ల తనకున్న గౌరవం మరింత పెరిగిందని హ‌న్సిక‌ చెప్పారు. `ఆట ఆరంభం`లో సుమ‌న్ రంగ‌నాథ‌న్ రిపోర్టర్ గా కనిపించింది.

వ‌న్: నేనొక్క‌డినే చిత్రంలో కృతి సనోన్ జ‌ర్న‌లిస్టుగా న‌టించి ఆక‌ట్టుకుంది. మహేష్ బాబు-సుకుమార్ కాంబినేష‌న్ మూవీలో నటనకు పెద్ద స్కోప్ ఉన్న పాత్ర‌తో కృతి మెప్పించింది. గ్లామ‌ర‌స్ పాత్రలతో ప్రేక్షకులను అల‌రించిన‌ చార్మి తమ్మారెడ్డి భరద్వాజ తెర‌కెక్కించిన‌ ప్రతిఘటనలో టీవీ కరస్పాండెంట్ పాత్రను పోషించింది. ఆమె కెరీర్ లో అత్యంత శక్తివంతమైన పాత్రలలో ఒకటి అని తెలిపింది. సాయి గోకుల్ రామ్‌నాథ్ దర్శకత్వం వహించిన‌ థ్రిల్లర్ లో కావ్య శెట్టి అనే న‌టి మిత్రా అనే జర్నలిస్టుగా కనిపించింది.

తనదైన‌ గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమల పాల్.. జోషి తెర‌కెక్కించిన‌ మలయాళ చిత్రం `రన్ బేబీ రన్` లో జర్నలిస్టుగా నటించారు. మోహన్ లాల్ టెలివిజన్ కెమెరామెన్ పాత్ర పోషించ‌గా అమలాపాల్ రిపోర్టర్ గా కనిపిస్తుంది.
Tags:    

Similar News