సూపర్‌స్టార్ సన్ లైఫ్ క్రేజీ హీరోయిన్ చేతిలో!
సినిమా ఇండస్ట్రీలో ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, సపోర్ట్ ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం, టన్నుల కొద్దీ టాలెంట్ ఉండాల్సిందే.;
సినిమా ఇండస్ట్రీలో ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, సపోర్ట్ ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం, టన్నుల కొద్దీ టాలెంట్ ఉండాల్సిందే. ఆ రెండూ లుకుండా..కేవలం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ మాత్రమే ఉన్న వారు ఇండస్ట్రీలో నిలబడలేకపోయారన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ టాలెంట్‌ని, అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్లు ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఎదిగారు. ఇప్పుడు అదే ఫార్ములాని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ వారసుడి కోసం ఫాలో అవుతున్నారు.
అందు కోసం క్రేజీ హీరోయిన్ సాయి పల్లవినే నమ్ముకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఖాన్ తన వారసుడు జునైద్ ఖాన్‌ని హీరోగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించడం లేదు. 2014లో `పీకె` మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన జునైద్ ఖాన్ ..విద్యాబాలన్, షఫాలీషా ప్రధాన పాత్రల్లో నటించిన `జల్సా`లో యాక్టింగ్ డెబ్యూగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో తనది కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే.
2024లో సిద్ధార్ధ్ మల్హోత్రా డైరెక్ట్ చేసిన హిస్టారిక్ డ్రామా `మహారాజ్`తో లీడ్ యాక్టర్‌గా అరంగేట్రం చేశాడు. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ షాలిని పాండే, షార్వరీ హీరోయిన్‌లుగా నటించిన ఈ మూవీపై హిందూ సంఘాలు అభ్యంతరం తెలపడంతో వివాదం తలెత్తింది. దీంతో గుజరాత్ హైకోర్టు రిలీజ్‌ను నిలిపివేసింది. థియేటర్లలో రిలీజ్ కాలేకపోయిన ఈ మూవీని ఫైనల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. వారసుడి అరంగేట్రానికి సంబంధించిన సినిమా వివాదాల నడుమ ఓటీటీలో రిలీజ్ కావడంతో ఆమీర్‌ఖాన్ తన తనయుడి కెరీర్‌ని పట్టాలెక్కించడానికి ఫైనల్‌గా సాయి పల్లవి నమ్ముకున్నాడు.
జులైద్ ఖాన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ రూపొందుతున్న లేటెస్ట్ మూవీ `మేరే రహో`. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ లవ్ డ్రామాని ఆమీర్‌ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. జపాన్‌లోని సప్పారో సిటీలో మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయి దాదాపు ఏడాది కావస్తున్న రిలీజ్‌కు నోచుకోవడం లేదు. కారణం పలు క్రేజీ సినిమాల రిలీజ్‌లు ఉండటం, వాటి మధ్య రిలీజ్ చేసి జునైద్ కెరీర్‌ని రిస్క్‌లో పెట్టడం ఇష్టంలేక ఆమీర్ ఈ మూవీ రిలీజ్‌ని ఆపుతూ వస్తున్నాడు.
ఫైనల్‌గా వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సాయి పల్లవి క్రేజ్ ఈ సినిమాకు ప్లాస్ కానుండటంతో ఆమీర్‌ఖాన్ ఆశలన్నీ తనపైనే పెట్టుకున్నాడట. తన క్రేజ్ తన తనయుడికి తొలి హిట్‌ని అందిస్తుందని భావించి హీరోయిన్‌గా సాయి పల్లవిని తీసుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కెరీర్ సాయి పల్లవి చేతిలో ఉందన్నమాట.