సుకుమార్ సినిమాకు చరణ్ టార్గెట్?
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ అండ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. తన సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించే సుకుమార్ పుష్ప, పుష్ప2 సినిమాలతో దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.;
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ అండ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. తన సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించే సుకుమార్ పుష్ప, పుష్ప2 సినిమాలతో దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాల కోసం సుకుమార్ తన కెరీర్లో చాలా సమయాన్నే వెచ్చించారు. టైమ్ తీసుకున్నా సరే దానికి తగ్గ ఫలితాన్ని ఆ సినిమాలతో సుకుమార్ అందుకున్నారు.
సుకుమార్ మూవీ కోసం రెడీ అవుతున్న చరణ్
అల్లు అర్జున్ తో పుష్ప, పుష్ప2 సినిమాలు చేసి మంచి డిమాండ్ ఏర్పరచుకున్న సుకుమార్ తన తర్వాతి సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరోవైపు చరణ్ కూడా తాను ప్రస్తుతం చేస్తున్న పెద్ది సినిమాను పూర్తి చేసి, సుకుమార్ సినిమాను చేయానికి సిద్ధమవుతున్నారు.
జులై లేదా ఆగస్టులో మొదలవనున్న షూటింగ్
సుకుమార్, రామ్ చరణ్ కలయికలో గతంలో రంగస్థలం అనే సినిమా వచ్చి అది బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి వారిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై అందరికీ విపరీతమైన అంచనాలున్నాయి. చరణ్ కెరీర్లో ఈ ప్రాజెక్టు 17వ సినిమాగా తెరకెక్కుతుండగా, ఈ మూవీ షూటింగ్ జులై లేదా ఆగస్ట్ నెలల్లో స్టార్ట్ అవనున్నట్టు తెలుస్తోంది.
ఏడాది లోపే పూర్తి చేయాలని టార్గెట్
అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాను రామ్ చరణ్ సంవత్సరం లోపే పూర్తి చేయాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఏడాది కంటే ఎక్కువ టైమ్ పట్టే సినిమాలను ఇకపై చేయడానికి రామ్ చరణ్ ఆసక్తి చూపడం లేదని, సినిమాలు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతోనే చరణ్ ఈ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. గేమ్ ఛేంజర్ కోసం కెరీర్లో ఎంతో టైమ్ ను వృధా చేసుకున్న చరణ్ ఇకపై అలాంటి తప్పులు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే సుకుమార్ సినిమా నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్ కు రిలీజయ్యే ఛాన్సుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
మార్చి 27న పెద్ది రిలీజ్
ఆర్సీ17 ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన సుకుమార్, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారని, ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక పెద్ది విషయానికొస్తే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.