ఆ రెండు సినిమాల రిజల్ట్ కోసం రామ్ వెయిటింగ్..?

ఐతే రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అవడానికి ముందే మరో రెండు కథలు తన దగ్గరకు వచ్చాయట కానీ రామ్ ఆ రెండిటినీ కాదన్నాడట.;

Update: 2026-01-02 05:33 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో సర్ ప్రైజ్ చేశాడు. మొన్నటిదాకా యాక్షన్ హీరోగా తన మార్క్ మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రామ్ సడెన్ గా కంటెంట్ కోసం ఒక అభిమాని రోల్ చేసి ఫ్యాన్స్ ని మెప్పించాడు. ఆంధ్రా కింగ్ తాలూకా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా రామ్ సినిమాలో ఆకట్టుకున్నాడు. ఐతే నెక్స్ట్ రామ్ సినిమా ఏదన్నది ఇంకా క్లారిటీ రాలేదు. రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.

రామ్ కాదనడంతో ఆ సినిమాలు

ఐతే రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అవడానికి ముందే మరో రెండు కథలు తన దగ్గరకు వచ్చాయట కానీ రామ్ ఆ రెండిటినీ కాదన్నాడట. రీజన్స్ పర్టిక్యులర్ గా తెలియకపోయినా రామ్ కాదనడంతో ఆ సినిమాలు వేరే హీరోల దగ్గరకు వెళ్లాయి. ఆ రెండు సినిమాలు కూడా అక్కినేని బ్రదర్స్ చేస్తున్నారు. అక్కినేని హీరో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు చేస్తున్న సినిమాల కథలు రామ్ వదిలేసినవే అని టాక్.

ముందుగా అఖిల్ చేస్తున్న లెనిన్ సినిమా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ అందుకున్న మురళి కిషోర్ ముందు లెనిన్ కథ రామ్ కి చెప్పాడట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ఇంకా సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉంటుందట. ఈ సినిమాతో పాటు కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య చేస్తున్న థ్రిల్లర్ సినిమా కథ కూడా ముందు డైరెక్టర్ రామ్ కి చెప్పాడట. ఐతే తనకు ఇలాంటి సినిమాలు చేయడం ఇష్టం లేదని రామ్ అన్నాడట. అలా చైతన్య, అఖిల్ సినిమాలు రెండు స్టోరీస్ రామ్ నుంచి వాళ్ల దగ్గరకు వచ్చాయట.

ఒక కథ ని రాసే టైంలోనే ఫలానా హీరో..

ఐతే ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత రామ్ ఎలాంటి సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే రామ్ మాత్రం కాదన్న ఆ రెండు సినిమాల రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడట. తనకు చెప్పిన ఆ కథలు ఎలా వర్క్ అవుట్ అవుతాయో రామ్ రిజల్ట్ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు.

సాధారణంగా డైరెక్టర్స్ ఒక కథ ని రాసే టైంలోనే ఫలానా హీరో అనుకుని రాస్తారు. కొన్ని సినిమాలు రాసుకున్న హీరోలతోనే చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ కొన్ని కథలు అలా కాదు. ఒక హీరో కాదంటే మరో హీరో ఆ సినిమా చేస్తుంటారు. అలా హీరోలు మారి హిట్టైన సినిమాలతో పాటు ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. రామ్ మాత్రం ఈ రెండు సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అవుతుందా లేదా అన్నది ఆ సినిమాల ఫలితం చూస్తే తెలుస్తుంది. ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత రామ్ మరో డిఫరెంట్ స్టోరీ తోనే ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు. త్వరలోనే రామ్ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది.

Tags:    

Similar News