• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ 10 షూటింగ్...

టాప్ 10 షూటింగ్ షెడ్యూల్స్

By - Tupaki Desk
Update: 2019-06-15 04:58 GMT
ఓవైపు స‌మ్మ‌ర్ హీట్ అంత‌కంత‌కు రాజుకుపోతోంది. రుతుప‌వ‌నాల రాక ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో ఎండ‌లు దంచేస్తున్నాయి. మ‌రో 15రోజులు భీక‌ర‌మైన ఎండ‌లు త‌ప్ప‌వ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. అయినా నిరంత‌ర షెడ్యూళ్ల‌తో మ‌న హీరోలు కుస్తీలు ప‌డుతున్నారు. హైద‌రాబాద్ - దిల్లీ-చెన్న‌య్- ముంబై -దిల్లీ- క‌శ్మీర్ వంటి చోట్ల షూటింగులు జ‌రుపుకుంటున్న ప‌లు చిత్రాల తాజా అప్ డేట్స్ ఇవి..

*స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని - గీతా ఆర్ట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది.

* మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌ సైరా - న‌ర‌సింహారెడ్డి పెండింగ్ ప్యాచ్ వ‌ర్క్ హైద‌రాబాద్ లో పూర్త‌వుతోంది. ద‌స‌రా రిలీజ్ అన్న మాట వినిపిస్తోంది.

*రామారావు- రామ్ చ‌రణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజ‌మౌళి రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. త్వ‌ర‌లో చ‌ర‌ణ్ షూట్ లో జాయిన్ అవుతున్నార‌ని స‌మాచారం.

*సూప‌ర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న `దర్బార్` సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఆగస్టు నెలాఖరుకల్లా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. నయనతార, నివేదా థామస్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

*నేచుర‌ల్ స్టార్  నాని హీరోగా విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న `గ్యాంగ్ లీడర్` సినిమా  షూటింగ్ ఈ నెల 17 నుంచి ఢిల్లీ లో జరుగనుంది. ఆగస్టు 30న సినిమా రిలీజ్.

* వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో, మైత్రి మూవీ మేకర్స్- సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న `ఉప్పెన` సినిమా రెగ్యులర్ షూటింగ్ కాకినాడ లో జరుగుతుంది.

*నాగ‌శౌర్య‌, మెహరీన్ జంటగా, రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేష‌న్స్‌ బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా రెండవ షెడ్యూల్  వైజాగ్ లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకి `అశ్వద్ధామ` టైటిల్  పరిశీలన లో ఉంది. ఈ చిత్రంలో రిస్కీ ఫైట్స్ కోసం ప్ర‌య‌త్నించి శౌర్య గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. నెల‌రోజులు శౌర్య‌పై షూటింగ్ కి బ్రేక్.

*శర్వానంద్ - సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్త‌యింది.

* విక్ట‌రీ వెంక‌టేష్‌- నాగ‌చైత‌న్య హీరోలుగా న‌టిస్తున్న వెంకీ మామ చిత్రీక‌ర‌ణ క‌శ్మీర్ బార్డ‌ర్ లో జ‌రుగుతోంది. బాబి ఈ చిత్రానికి ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


Tags:    
  • Tollywood Movie Shootings 
  • Latest News 
  • Datbar movie 
  • Sye Raa 
  • Telugu news 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS