టాలీవుడ్ లో వ్యూస్ పరంగా టాప్-10 టీజర్స్..!

Update: 2021-08-10 23:30 GMT
సినిమాను జానాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమా అయినా.. కొన్ని కోట్లు పెట్టి తీసిన పాన్ ఇండియా మూవీ అయినా సరైన పబ్లిసిటీ చేయకపోతే అంతే సంగతులు. ప్రస్తుతం ప్రచారం కోసం మీడియాతో పాటుగా సోషల్ మీడియాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అక్కడ ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చే స్పందనను బట్టి సినిమాకు బజ్ ఉందా లేదా అనేది నిర్ణయిస్తున్నారు. అందుకే 24 గంట‌ల్లో టీజర్ కు ఇన్ని లైక్స్ వచ్చాయని.. ట్రైలర్ కు అన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని మేకర్స్ ప్రచారం చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. టాలీవుడ్ లో వ్యూస్ పరంగా టాప్ లో ఉన్న టీజర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' టీజర్ టాలీవుడ్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్‌ గా నెం.1 స్థానంలో నిలిచింది. మహేష్ బర్త్ డే స్పెషల్ గా ఆగస్ట్ 9న విడుదలైన ఈ టీజర్ 24 గంటల్లో 25.7 మిలియన్ రియల్ టైం వ్యూస్ సాధించింది. అది కూడా యాడ్స్ లేకుండా ఈ ఫీట్ అందుకుంది. టీజర్ లీక్ అవడంతో ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం కాకుండా, మేకర్స్ హడావిడిగా అర్థరాత్రి విడుదల చేశారు. అయినప్పటికీ 24 గంటల్లో టాలీవుడ్ లో హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ క్రమంలో 'పుష్ప' టీజర్ రికార్డ్ ను 'సర్కారు వారి..' బ్లాస్టర్ బ్రేక్ చేసింది.

యూట్యూబ్ అప్డేటెడ్ వ్యూస్ ప్రకారం 'పుష్ప' టీజర్ 24 గంటల్లో 22.52 మిలియన్ వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 'సరిలేరు నీకెవ్వరు' (14.64M) - 'రామారాజు ఫర్ భీమ్' (14.14M) - 'సాహో' (12.94M) - 'మహర్షి' (11.14M) - 'భరత్ అనే నేను' (8.67M) - 'వకీల్ సాబ్' (8.57M) టీజర్స్ నిలిచాయి. ఇక ఓవరాల్ గా ఈరోజు వరకు తెలుగులో అత్యధికంగా వీక్షించిన టీజర్స్ విషయానికి వస్తే.. 'పుష్ప' టీజర్ 79.92 మిలియన్ వ్యూస్‌ తో టాప్‌ లో ఉంది. 'భీమ్ ఫర్ రామరాజు' ( 61.56M) - 'రామరాజు ఫర్ భీమ్' (56.17M) - 'అఖండ' (55.93M) - 'సరిలేరు నీకెవ్వరు' ( 34.02M) - 'సాహో' (32.39M) - 'అల వైకుంఠపురములో' (31.59M) - 'సర్కారు వారి పాట' (28M) - 'సాహో' (23.86M) - 'ఆచార్య' (22.42M) హయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్స్ గా నిలిచాయి. ఇందులో 'సర్కారు వారి పాట' టీజర్ కు ఒకటిన్నర రోజులోనే 28 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.


Tags:    

Similar News