మేడ్ ఇన్ ఇండియా BMW బైక్ పై టామ్ క్రూజ్ మిషన్?
మిషన్ ఇంపాజిబుల్ 7 కోసం టామ్ క్రూజ్ ఎలాంటి బైక్ వాడుతున్నారు? ప‌్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్ ఇది. దానికి ఆన్సర్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోనే. మేడ్-ఇన్-ఇండియా బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ మోడల్ బైక్ పై టామ్ సాహసవిన్యాసాలు చూడతరమా?
విమానంలోంచి ఎగిరి గంతేసినా.. మెషీన్లతో పోరాడినా టామ్ విన్యాసాలకు కళ్లు చెదరాల్సిందే. మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీ షూటింగ్ సమయంలో మేడ్-ఇన్ ఇండియా బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ మోటార్ సైకిల్‌ను నడుపుతూ కంటపడడం ఆ స్నాప్ యూత్ లో వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయింది. టామ్ బైక్ రైడ్ స్పెషలిస్ట్. గతంలో ఈ సినిమా కోసం క్లిఫ్ జంప్ స్టంట్ ప్రదర్శించారు.
ఇక ఈ బైక్ ఏ కంపెనీది? అంటే.. TVS కంపెనీలో బీఎండబ్ల్యూ వాళ్ల తయారీ అని తెలుస్తోంది. భారతదేశంలో తయారు చేయడం దీని ప్రత్యేకత. టామ్ క్రూజ్ గతంలో MI7 కోసం మోటారుసైకిల్ స్టంట్ చేసారు. టామ్ క్రూజ్ ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీ 7వ భాగం చిత్రీకరణలో ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ మూవీలో అన్ని కార్లు లగ్జరీ బైక్ లు MI7 లో కనిపించనున్నాయట.
ప్రతి సారీ కొన్ని థ్రిల్లింగ్ చేజ్ సీక్వెన్సులు .. బైక్ స్టంట్స్ తో రీల్ ఆద్యంతం అభిమానుల హృదయాలను రేసింగ్ మూడ్ లోకి తీసుకెళుతుంది. రాబోయే సినిమా దీనికి మినహాయింపు కాదు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. టామ్ క్రూజ్ బాడీ-డబుల్ ఉపయోగించకుండా స్టంట్స్ చేయడం మరో హైలైట్. కొత్త మిషన్ ఇంపాజిబుల్ చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు, నటుడు పాపింగ్ వీలింగ్,.. బైక్‌పై రాంప్ జంప్ లు చేసాడు. ఎండ్యూరో బైక్ పై కొండపై నుంచి దూకడం..., బహుశా హోండా సిఆర్‌ఎఫ్ 450 దానికి ఉపయోగించారట.
ఇక జి 310 జిఎస్ ను భారతదేశంలో ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కోసం హోసూర్ లోని టివిఎస్ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. ఈ చిత్రంలో టామ్ క్రూజ్ ఉపయోగించిన వాహనం వాస్తవానికి ఇటాలియన్ పోలీసులు పెట్రోలింగ్ వాహనంగా ఉపయోగించిన మోడల్. ఇది ప్రత్యేకమైన కలర్ స్కీమ్.. హెచ్చరిక లైట్లు .. సైడ్ ప్యానళ్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. జర్మన్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ఇటీవలే భారతదేశంలో కొత్త బిఎస్ 6 మోడల్‌ను లాంచ్ చేసింది. కొత్త లుక్ లో జి 310 జిఎస్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కొత్త ఎల్‌ఇడి హెడ్ ల్యాంప్ క్లస్టర్ ను కలిగి ఉంది. కొత్త కలర్ ఆప్షన్లలో ఈ బైక్ లభిస్తుంది. ఈ బైక్ 313 సిసి.. లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. 34 బిహెచ్.పి మరియు 28 ఎన్‌ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో స్లిప్పర్-క్లచ్ తో ప్రామాణికంగా జత చేయబడింది. సున్నితమైన థొరెటల్ ప్రతిస్పందన కోసం రైడ్-బై-వైర్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.