కోలీవుడ్ స్టార్ హీరోలపై దృష్టి పెట్టిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్..!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం కొనసాగుతోంది. ఫిలిం మేకర్స్ అందరూ మంచి కంటెంట్ తో భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ తో పోల్చుకుంటే సక్సెస్ రేట్ కూడా సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది. ఈ క్రమంలో తమిళ దర్శకులు - తెలుగు స్టార్ హీరోల కాంబోలో.. కోలీవుడ్ స్టార్ హీరోలు - టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కాంబినేషన్ లో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఇటీవల ఓ మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్ కి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందనుంది. 'లవ్ స్టోరీ' మేకర్స్ నారాయణ్ దాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు తమిళం హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇన్నాళ్లూ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనుష్.. ఈ సినిమాతో డైరెక్ట్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. సున్నితమైన చిత్రాలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న శేఖర్ కమ్ముల.. ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటడానికి ట్రై చేస్తున్నారు.
ఇళయదళపతి విజయ్ ఎన్నాళ్ళుగానో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'మాస్టర్' సినిమాతో ఇక్కడి ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఓ పాన్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ చేసాడు. 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికీ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై #Thalapathy66 సినిమా రూపొందనుందని దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇంతకముందు 'ఊపిరి' చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు అందించిన వంశీ పైడిపల్లి మరోసారి కోలీవుడ్ లో సత్తా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్ లో పాగా వేస్తాడేమో చూడాలి.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఇప్పుడు తమిళ హీరో విజయ్ తో ఓ సినిమా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ తో సినిమా చేయడానికి విజయ్ కూడా ఆసక్తి కనబరిస్తున్నారని టాక్ నడుస్తోంది. దిల్ రాజు బ్యానర్ తో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న విజయ్.. వెంటనే అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో చేతులు కలిపితే మార్కెట్ పరంగా మరో మెట్టు ఎక్కినట్లే అని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో వీరి కాంబినేషన్ లో సినిమా కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి. మరోవైపు ధనుష్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. 'తొలిప్రేమ' 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా2ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఎప్పటి నుంచో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా సూర్య తో ఓ బైలింగ్విల్ చేయనున్నాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే కథలు నచ్చకపోవడంతో ఈ కాంబో కుదరలేదని తెలుస్తోంది. అయితే రీసెంటుగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య ఓ ద్విభాషా చిత్రం చేయనున్నారని.. దిల్ రాజు బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్ వచ్చింది. బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ.. బోయపాటి కోలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు తమిళ స్టార్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతను మన అగ్ర నిర్మాతలు తీసుకుంటున్నారనేది అర్థం అవుతోంది.