బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?
సినిమాలు తీయడంలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ది ప్రత్యేకమైన శైలి. యునిక్ కాన్సెప్ట్ తీసుకొని, ఎంతటి స్టార్ హీరో అయినా రెండు నెలల్లో సినిమా తీసి చేతిలో పెట్టగలడు. అందుకే నిర్మాతలు డబ్బు పెట్టడానికి రెడీగా ఉంటే.. ప్రతి హీరో కూడా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. పూరీ వర్కింగ్ స్టైల్ కి టాలీవుడ్ తో పాటుగా శాండిల్ వుడ్ కూడా ఫిదా అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు పూరీ శైలి నచ్చి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆయన్ని హిందీ పరిశ్రమలోనే కొనసాగాలని కోరుతున్నారట.
పూరీ జగన్నాథ్ గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో 'బుడ్డా హోగా తీరే బాప్' అనే హిందీ సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత 'బిజినెస్ మ్యాన్' చిత్రాన్ని బాలీవుడ్ లో చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మళ్ళీ 'లైగర్' సినిమాతో బీ టౌన్ లో హాట్ టాపిక్ అయ్యారు పూరీ. విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా 'లైగర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ. పాన్ ఇండియన్ స్థాయిలో నాలుగు భాషల్లో దీన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ తో కలిసి పూరి - ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.
పూరీ వర్కింగ్ స్టైల్ నచ్చిన కరణ్ జోహార్.. ధర్మ ప్రొడక్షన్ లో మరికొన్ని హిందీ సినిమాలు చేయాలని ఆఫర్ ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే ఇకపై పూరి జగన్నాథ్ బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా బాలీవుడ్ బాట పట్టి కొన్నాళ్ల పాటు ముంబై కే పరిమితం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి హిందీతో పాటుగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అతని శిష్యుడు పూరీ కూడా బాలీవుడ్ బాట పట్టనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.