• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి స్పెషల్.....

సంక్రాంతి స్పెషల్.. జూనియర్ ఎన్టీఆర్ లుక్ అదుర్స్..

| టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By - Madhu Reddy
Update: 2026-01-15 07:14 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్న ఈయన.. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా జపాన్ అభిమానుల ఫేవరెట్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల.. తన దేవరా సినిమాను అక్కడ రిలీజ్ చేసి మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే సౌత్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది బాలీవుడ్ అరంగేట్రం కూడా చేశారు. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన వార్ 2 చిత్రం ద్వారా విలన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే తాత్కాలిక టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అనే ఉత్సాహం అభిమానులలో కలగగా.. అప్పుడప్పుడు బయటకు వస్తున్న ఆయన లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది..దేవర సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరింత బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన బావమరిది ప్రముఖ హీరో నార్నే నితిన్ పెళ్లి వేడుకల్లో కనిపించి తన లుక్కుతో అందరినీ ఆశ్చర్యపరిచారు జూనియర్ ఎన్టీఆర్.

అంతేకాదు ఇటీవల ఒక జువెలరీ బ్రాండ్ ప్రమోషన్ లో కూడా ఆయన మరింత సన్నగా కనిపించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన కొత్త లుక్ తో అందరిని మెస్మరైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి కావడంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తన లుక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎయిర్పోర్టులో కెమెరాల కంట పడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఊర మాస్ గెటప్ లో కనిపించి అభిమానులను అలరించారు. ఎంతో పవర్ఫుల్ గా కనిపించారు. ముఖ్యంగా ఈ కొత్త మేకోవర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న తను తదుపరి చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ కొత్త గెటప్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.. సంక్రాంతి సందర్భంగా అసలైన లుక్ బయటకు వచ్చింది అని అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Tags:    
  • jrntr 
  • newntrlook 
  • sankranti2026 
  • prashanthneelfilm 
  • dragonmovie 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS