క్రైసిస్ లో టాలీవుడ్ న‌ష్టం గ్రాఫ్ పైపైకి..!

Update: 2020-08-05 04:30 GMT
నాలుగైదు నెల‌లుగా టాలీవుడ్ ప‌రిస్థితి ఆగ‌మ్యగోచ‌ర‌మే అయ్యింది. షూటింగుల్లేవ్.. రిలీజుల్లేవ్.. ప‌రిశ్ర‌మ స్థంబించి పోయింది. మ‌హ‌మ్మారీకి భ‌య‌ప‌డి కార్మికులు ఎటెళ్లిపోయారో తెలీని ప‌రిస్థితి. బ‌తుకు లేక తిండికి లేక 24 శాఖ‌ల‌ టెక్నీషియ‌న్లు అల్లాడుతున్నారు. ఈ నాలుగైదు నెల‌ల్లో నెల‌కు 10-15 సినిమాల చొప్పున చూసుకున్నా 50 సినిమాల వ‌ర‌కూ చిన్నా పెద్దా క‌లుపుకుని రిలీజ‌య్యేవి. కానీ ఏదీ కుద‌ర‌లేదు. కీల‌క‌మైన స‌మ్మ‌ర్ అంతా వృథా అయిపోయింది. ఇంపార్టెంట్ పండ‌గ‌లు కోల్పోయారు.

ఇన్ని నెల‌లు ఇలా స్థంబించిపోవ‌డం అన్న‌ది ఏనాడూ లేదు. బ‌హుశా తెలుగు సినీప‌రిశ్ర‌మ చ‌రిత్ర‌లో ఇలాంటి దినాలు మళ్లీ చూడ‌లేమేమో! ఈ ఐదు నెల‌ల్లో ప‌రిశ్ర‌మకు ఎంత న‌ష్టం వాటిల్లింది? అన్న‌ది సుమారుగా అంచ‌నా వేస్తే 600 నుంచి 1000 కోట్లు మినిమంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌త్య‌క్షంగా 600కోట్లు న‌ష్టం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తే .. ప‌రోక్షంగా మ‌రో 400కోట్లు అద‌నపు న‌ష్టం క‌లుపుకుని వెయ్యి కోట్ల న‌ష్టం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.

ఆరు నుంచి ప‌ది సినిమాలు నెల‌కు రిలీజ‌య్యేవి. అవ‌న్నీ ఇప్పుడు వాయిదాల ప‌ద్ధ‌తిలో వెయిటింగులో ఉన్నాయి. వీటికి ఇంకా రిలీజ్ తేదీపైనే క్లారిటీ లేదు. క్రైసిస్ పోయేది ఎపుడో కూడా తెలీని ధైన్యం నెల‌కొంది. వేచి చూసే ధోర‌ణితో ఉండే కొద్దీ న‌ష్టం పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1600 స్క్రీన్లు ఉండొచ్చ‌ని అంచ‌నా. 1200 సింగిల్ స్క్రీన్లు.. మిగ‌తావి మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉంటాయి. ఇవ‌న్నీ ఇన్నాళ్లు మూత‌ప‌డి ఉన్నాయి. థియేట‌ర్ రంగంలో కార్మికులు తిండికి లేని ప‌రిస్థితితో ఉన్నారు. ఉపాధి లేక ఉత్ప‌త్తి లేక ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌ర‌మే అయ్యింది. వైర‌స్ కి వ్యాక్సినో టీకానో రాక‌పోతే పూర్తిగా క‌ట్ట‌డి చేయ‌క‌పోతే ఇక క‌ష్ట‌మే. ఈ న‌ష్టాల గ్రాఫ్ అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంటుంది. ప్ర‌తియేటా 200 సినిమాలు రిలీజ‌య్యేవి. ఈ ఏడాది అందులో 80-90శాతం కోల్పోయిన‌ట్టే.
Tags:    

Similar News