నార్త్ మీద మోజు ప‌డుతున్న టాలీవుడ్ హీరోలు..!

Update: 2021-06-06 00:30 GMT
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్స్ గా రాణించే ప్రతీ ముద్దుగుమ్మ ఫైన‌ల్ డెస్టినేషన్ బాలీవుడ్ గా ఉండేది. క్రేజ్ కోసమో రెమ్యూనరేషన్ కోసమో కానీ కథానాయికలు అందరూ హిందీ ఇండ‌స్ట్రీ మీద ఫోకస్ పెట్టేవారు. ఇప్పటికే సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో సత్తా చాటిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే మొన్నటి వ‌ర‌కు స్టార్ హీరోయిన్లు నార్త్ మీద మోజు ప‌డుతుండేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

బాలీవుడ్ లో అడుగుపెట్ట‌డానికి చిన్న‌పాటి క్రేజ్ ఉన్న కుర్ర హీరోల ద‌గ్గ‌ర నుంచి పెద్ద హీరోల వ‌ర‌కు అంతా క్యూలు క‌డుతున్నారు. అక్కడ కూడా క్రేజ్ తెచ్చుకొని మార్కెట్ విస్తరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారిలో కొందరు హీరోయిన్ల మాదిరి డైరెక్ట్ గా బాంబే వెళ్ల‌కుండా.. ముందుగా సౌత్ మార్కెట్ ని పెంచుకొని ఆ త‌రువాత బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - రానా దగ్గుబాటి - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ - నాగచైతన్య - సందీప్ కిషన్ - నవీన్ పోలిశెట్టి - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - ఆది సాయికుమార్ వంటి హీరోలు హిందీ మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నారు. కొందరు స్ట్రెయిట్ హిందీ సినిమాలు చేస్తుంటే.. మరికొందరు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు నాగార్జున - చిరంజీవి - వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేశారు. కాకపోతే అక్కడే ఉండి పోకుండా కొన్ని సినిమాలు చేసి మళ్ళీ సొంత గూటిగే చేశారు. వారిలో నాగ్ ఒక్కరే హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్న మన టాలీవుడ్ హీరోలు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
Tags:    

Similar News