కింగ్ నాగ్ సరసన టాలీవుడ్ గ్లామరస్ యాంకర్..?
తెలుగు ఇండస్ట్రీలో సినీ హీరోయిన్స్ తో కొందరు టీవీ యాంకర్స్ కూడా అదే రేంజిలో క్రేజ్ దక్కించుకుంటారు. అలాంటి టీవీ యాంకర్స్ ఎవరైనా ఉన్నారంటే వారిలో రష్మీ గౌతమ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎల్లప్పుడూ టీవీ షోలలో తన గ్లామర్ గుప్పిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే టీవీ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టిన రష్మీ.. అక్కడ కూడా అందాల ఆరబోతకు సై అంటోంది. ప్రేక్షకులను అలరించడానికి అమ్మడు ఎల్లప్పుడూ రెడీనే అంటుంది. అయితే ఎన్ని సినిమాలు - టీవీ షోలు చేసినప్పటికి రష్మీకి గుర్తింపు తెచ్చింది మాత్రం జబర్దస్త్ కామెడీ షోనే అని చెబుతోంది. ప్రస్తుతం అమ్మడు కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పెడుతూ కుర్రాళ్లకు కిక్కిస్తోంది.
ఇటీవలే ఏప్రిల్ 27న రష్మీ పుట్టినరోజు జరుపుకుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీ పై మక్కువతో వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది రష్మీ. వచ్చిరాగానే రెండు మూడు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ తో పాటు హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు నిరాశపరిచే సరికి లాభం లేదనుకుని సీరియల్స్‌లో నటించింది. అందులో కూడా అదృష్టం లేకపోవడంతో జబర్దస్త్ షో అనేది రష్మీ కెరీర్‌ను మలుపు తిప్పేసింది. యాంకర్‌గా తనకు వచ్చిరానీ తెలుగును వెరైటీగా పలికేస్తూ సక్సెస్ అవుతోంది. అలా యాంకర్ గా ఫామ్ లో ఉండగానే గుంటూరు టాకీస్ సినిమాలో తన అందాలన్నీ ఆరబోసి అందరిచూపు తనవైపు తిప్పుకుంది. అప్పటి నుండి యాంకర్ కం యాక్ట్రెస్ గా రాణిస్తోంది అమ్మడు.
ఇదిలా ఉండగా.. తాజాగా రష్మీ కింగ్ నాగ్ - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదివరకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనే గుంటూరు టాకీస్ సినిమా చేసి మంచి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని వరుసగా పలు గ్లామరస్ మూవీస్ చేసింది. ఇన్నేళ్లకు మళ్లీ రష్మీ ప్రవీణ్ సినిమాలో నటించనుందని టాక్. అలాగే కింగ్ నాగ్ బ్యానర్ లో రూపొందిన యువ అనే టీవీ సీరియల్ ద్వారా పరిచయమైంది రష్మీ. ఇప్పుడు ఆయన సినిమాలో ఆయన పక్కనే క్యారెక్టర్ చేయనుందట. ఈ లెక్కన రష్మీకి లక్ బాగానే ఉందని చెప్పవచ్చు. ఇదేగనక నిజమైతే.. ఫుల్ లెన్త్ భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మీ ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అమ్మడి కెరీర్ స్పీడప్ అవుతుందేమో చూడాలి.