ట్రెండీ టాక్: `ఫిలింక్రిటిక్స్` ఎన్నికలు?
ఎనిమిది దశాబ్ధాల సుదీర్ఘ చరిత్ర టాలీవుడ్ కి ఉంది. ఇండియాలోనే రెండో అతి పెద్ద పరిశ్రమగా అవతరించింది. ఇక్కడ యేడాదికి 200 పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. ఇంత పెద్ద పరిశ్రమలో 24 శాఖలు అసోసియేషన్లు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అన్ని అసోసియేషన్లకు విధివిధానాలు.. గౌరవం.. గుర్తింపు.. పద్ధతి అన్నది ఏర్పాటు చేసుకుని కార్మికులంతా ఐక్యంగా పని చేస్తున్నారు. టాలీవుడ్ లో ఫెడరేషన్ విధివిధానాలు.. నియమావళి బలంగానే పని చేస్తున్నాయి. అయితే అసలు ఏ అసోసియేషన్ కి చెందని 25వ శాఖ ఒకటి సినీపరిశ్రమలో అప్పనంగా పడి ఉంది.. అదేంటో తెలుసా? అదే ఫిలిం జర్నలిజం. ఈ వృత్తిని నమ్ముకుని బతుకు వెళ్లదీసే జర్నలిస్టులెందరో. దాదాపు 150 మంది ప్రత్యక్షంగా మీడియా సమావేశాలకు ఎటెండ్ అయ్యేవాళ్లు ఉంటే.. పరోక్షంగా డెస్క్ జర్నలిస్టులు.. సబ్ ఎడిటర్లు అందరినీ కలుపుకుంటే సుమారు 300 మంది సినిమా వార్తల కోసం నిరంతరం యజ్ఞంలా పని చేస్తూ ఉంటారు. అయితే ఇంతమందికి ఒక గుర్తింపు అన్నది ఉందా? అంటే అది ఎప్పటికీ సందిగ్ధమే. పీఎఫ్ లు - ఇన్సూరెన్స్ గ్యారెంటీ లేని ఉద్యోగులే ఇందులో మెజారిటీ పార్ట్. అయితే ఇలాంటి వారి కోసం ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అని ఆదుకునేందుకు ఒకటుంది. దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో మనుగడ ఉన్న అసోసియేషన్ ఇది. అయితే ఇటీవల కొంతకాలంగా పెద్దల నిర్లక్ష్య వైఖరితో ఈ అసోసియేషన్ సుప్తావస్థలోకి వెళ్లిపోవడంపై 300 మంది సినీ జర్నలిస్టులతో పాటు హైదరాబాద్ లో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘాల్లోనూ చర్చ సాగుతుండడం ఆసక్తికరం. ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ అంతటి వారే `ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్` అతి పెద్ద అసోసియేషన్ అని గుర్తు చేశారు. ``సుదీర్ఘ కాలంగా ఉన్న అసోసియేషన్ ఇది.. నాకు తెలిసినంతవరకూ సినిమా జర్నలిస్టుల కోసం పని చేసిన ఏకైక అసోసియేషన్ ఇదొక్కటే!!`` అని ఇటీవల ఓ సందర్భంలో ప్రస్థావించారంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంఘం ఎందుకు నిద్ర పోతోంది? యాక్టివేట్ అయ్యేదెప్పుడు? అంటే అదో సస్పెన్స్ మిస్టరీ సినిమానే తలపిస్తోందనేది యువజర్నలిస్టుల ఆవేదన. గత కొంతకాలంగా యూట్యూబ్- సోషల్ మీడియా వెల్లువలో ప్రధాన సీనియర్ జర్నలిస్టులు.. 10-15 ఏళ్లుగా అనుభవం ఉన్న యువ జర్నలిస్టులకు మినిమం గుర్తింపు లేకుండా సైడ్ లైన్ లోకి వెళ్లిపోవాల్సిన సందిగ్ధావస్థ తలెత్తింది. నవతరం ట్యాలెంట్ దూసుకు రావడం .. ఎవరికి వారు జర్నలిస్టులం అని చెప్పుకుని యూట్యూబ్ చానెళ్ల అండగా హడావుడి చేయడం.. దీంతో పీఆర్వోలు మీడియా కరెక్షన్ పేరుతో చర్చలు జరపడం.. ఇవన్నీ ఊహించని తాజా పరిణామాలు. ఈ పరిణామంలోనే అతి పెద్ద కీలక మలుపు ఫిలింన్యూస్ కాస్టర్స్ అసోసియషన్ ఏర్పడడం. చాలా కాలంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ లో సభ్యత్వం కోసం వేచి చూసిన కొందరు సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సదరు క్రిటిక్స్ అసోసియేషన్ సుప్తావస్థలో ఉండడంతో సొంతంగా అసోసియేషన్ పెట్టుకునే యోచన చేశారు. అనుకున్నదే తడవుగా అసోసియేషన్ ఏర్పాటు చేసి దాదాపు 200 మందిని సంఘంలో చేర్చుకున్నారు. ఇక్కడే వచ్చిందో చిక్కు. ఈ అసోసియేషన్ లో ప్రింట్ మీడియా ప్రతినిధుల్ని చేర్చుకోకపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగింది. అయితే దీనిపై గ్రూపుగా వచ్చి మాట్లాడితే సమస్యను పరిష్కరిస్తామని కాస్టర్స్ అసోసియేషన్ పెద్దలు పాజిటివ్ గానే స్పందించడంతో యువతరం జర్నలిస్టుల్లో ఆశలు చిగురించాయి. దీనిపై మునుముందు విస్త్రత చర్చ జరగనుంది.
ఇన్ని ఎపిసోడ్స్ అనంతరం మరో కొత్త పరిణామమిది. అదే ``ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్`` రీ-యాక్టివేషన్. ఈనెల (మే) 26న ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఎన్నికల్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. క్రిటిక్స్ కీలక వ్యక్తులు.. మెంబర్స్ ఇటీవలే మీటింగ్ పెట్టుకుని సంభాషించారు. 80 ఏళ్ల చరిత్రలో 60 ఏళ్లుగా యాక్టివ్ గా ఉన్నది ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ మాత్రమే. దీనిని వెంటనే యాక్టివేట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇక మీడియా డివైడ్ ఫ్యాక్టర్ ప్రభావం పైనా ఆసక్తికర చర్చ సాగింది. యాక్టివ్ గా ఉన్న ఈ-వెబ్ మీడియాకి న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. తమ సభ్యులకు ఇన్సూరెన్సులు వగైరా కల్పిస్తూ .. నిధి సేకరణ కార్యక్రమాలతో జోరు మీద ఉంది. ఆ క్రమంలోనే ప్రింట్ జర్నలిస్టుల అనైక్యతపైనా ఆసక్తికర చర్చ సాగింది. పలు దఫాలు ప్రింట్ జర్నలిస్టులు తమ అనైక్యతను తమకు తామే నిందించుకునే ధైన్యం పైనా చర్చ సాగిందిట. అందుకే ఇప్పుడు క్రిటిక్స్ అసోసియేషన్ యాక్టివేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మే 26న ఎన్నికల తర్వాత ప్రింట్ మీడియాలో ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల అనుభవం ఉండీ.. క్రిటిక్స్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందని యువజర్నలిస్టులందరికీ సభ్యత్వాలకు అవకాశం కల్పించనున్నారట. ఇప్పటికే 50 పైగా అప్లికేషన్లు క్రిటిక్స్ అసోసియేషన్ కలెక్ట్ చేసింది. అయితే క్రిటిక్స్ అసోసియేషన్ యాక్టివేట్ అయితే లీడ్ లో ఉన్న ప్రింట్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా ఉంటుందని భావిస్తున్నారు. బతుకు ఆగమ్యగోచరంగా ఉండే జర్నలిజంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో.. ఎక్కడ ఏ ఉద్యోగం ఊడుతుందో తెలీని ధైన్యం ఉంటుంది. చేసే పనికి గుర్తింపు అసోసియేషన్ సభ్యత్వంతోనే సాధ్యం. అది చాలా ఇంపార్టెంట్. అస్తవ్యస్థ అవ్యవస్థలా సాగిపోయే ఇలాంటి చోట అసోసియేషన్లు లేకపోతే అంతే సంగతి.. అధో గతి తప్పదు!! .. అంటూ ముచ్చటా నిరంతరం సాగుతుంటుంది. ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఎన్నికలతో యాక్టివేట్ అవుతుండడంతో పలువురు ప్రింట్ జర్నలిస్టుల్లో నూతనోత్సాహం నింపుతోంది.