అల్లు సినిమాస్‌లో ఫ‌స్ట్ ఈవెంట్‌!

మెలోడీ బ్ర‌హ్మ‌గా పేరున్న మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్‌ని మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు.;

Update: 2026-03-28 12:59 GMT

విభిన్న‌మైన సినిమాల‌ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. `క‌` మూవీతో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఈ హీరో `కె ర్యాంప్‌`తో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. దీని త‌రువాత రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్న మూవీ `చెన్నై ల‌వ్ స్టోరీ`. గౌరీ ప్రియ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీకి ర‌వి నంబూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సాయి రాజేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మాస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌కెఎన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని స్టార్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ విడుద‌ల చేయ‌డం తెలిసిందే. ఫ‌స్ట్ లైవ్ ఫెయిలైయిందంటే బెస్ట్ ల‌వ్ ఎక్క‌డో మొద‌ల‌వుతుంద‌ని` అనే డైలాగ్‌ల‌తో సాగిన గ్లింప్స్‌ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఓ ప్యూర్ ల‌వ్ స్టోరీని ప్రేక్ష‌కుల‌కు సాయి రాజేష్‌, ఎస్‌కెఎన్ మ‌రోసారి అందించ‌బోతున్నార‌ని స్ప‌ష్టం చేసింది. మెలోడీ బ్ర‌హ్మ‌గా పేరున్న మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్‌ని మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు.

సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేస్తూ ప్ర‌మోష‌న్స్‌ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే దీని కోసం వేదిక‌గా అల్లు సినిమాస్‌ని ఎంచుకుంది టీమ్‌. హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో ఉన్న అల్లు సినిమాస్ ఇటీవ‌లే భారీ స్థాయిలో ప్రారంభం కావ‌డం తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద దైన 75 అడుగుల డాల్బీ సినిమా స్క్రిన్. బార్కో లేజ‌ర్ 4కె ప్రొజెక్ష‌న్,డాల్బీ అట్మోస్ వంటి అదునాత‌న టెక్నాల‌జీతో సిద్ధం చేశారు.

ఇప్ప‌టికే హైద‌రాబాద్ ప్రియుల‌కు వినోదానికి డెస్టినేష‌న్ హ‌బ్‌గా నిలుస్తున్న అల్లు సినిమాస్‌లో తొలి సారి సినిమా ఈవెంట్‌ని `చెన్నై ల‌వ్‌స్టోరీ`తో స్టార్ట్ చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు సినిమా ఫంక్ష‌న్స్, లిరిక‌ల్ వీడియోస్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌ని గ‌చ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో రిలీజ్ చేసేవారు. ఇప్పుడు అల్లు సినిమాస్‌కి ఈ ఈవెంట్‌ల‌ని షిఫ్ట్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాల‌నే ప్లాన్‌ని `చెన్నై ల‌వ్‌స్టోరీ` స్టార్ట్ చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటే ఎస్‌కెఎన్ త‌న సినిమా లిరిక‌ల్ వీడియోని అల్లు సినిమాస్ వేదిక‌గా రిలీజ్ చేస్తుండ‌టంతో మిగ‌తా వారు కూడా అక్క‌డ మూవీ ఈవెంట్‌లు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతారనే చ‌ర్చ మొద‌లైంది.

Tags:    

Similar News