లగాన్..దంగల్..బుచ్చిబాబు భలే ప్లాన్ చేశాడే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `పెద్ది`.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `పెద్ది`. బుచ్చిబాబు సాన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. మర్చి 27న ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ మూవీని `ఉస్తాద్ భగత్‌సింగ్` కారణంగా వాయిదా వేయడం తెలిసిందే.
ఏప్రిల్ 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. చికిరి...రైరై రారా.. పాటలు సినిమాకు మరింత హైప్‌ని తీసుకొచ్చాయి. ఇంత వరకు క్రికెట్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అంతా భావించారు. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ రామ్ చరణ్ కొత్త స్టైల్ బ్యాటింగ్‌తో రచ్చ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి భారీ హైప్‌ని క్రియేట్ చేసింది.
రెగ్యులర్ పంథాలో కాకుండా సరికొత్త స్టైల్లో చరణ్ బ్యాట్‌ని ఝుళిపించిన తీరు ప్రత్యేకంగా ఉండటంతో ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. టీజర్‌లో ఒక్క సీనే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో..చరణ్ ఏ స్థాయిలో అదరగొట్టాడో అని అంతా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు మార్చి 27న `పెద్ది పహిల్వాన్` పేరుతో వీడియో రిలీజ్ చేసి షాక్ ఇవ్వడంతో అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియోలో రామ్‌చరణ్ పహిల్వాన్‌లా కుస్తీపడుతూ గురవుని మెప్పించే ప్రయత్నం చేస్తుండటంతో బుచ్చిబాబు ట్విస్ట్ ఇచ్చాడనే చర్చ మొదలైంది. `కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా..పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట` అని తాజా వీడియోలో కనిపించని స్వరం పెద్ది క్యారెక్టర్‌ని హెచ్చిరిస్తున్న తీరుని చూస్తుంటే ఈ కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగదని, క్రికెట్‌లో టాప్ అనిపించుకున్న ఓ యువకుడు కుస్తీ నేపథ్యంలో సాగు కథ అని క్లారిటీ వచ్చేసింది.
ఒకే కథలో రెండు ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉండటంతో `పెద్ది`పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కున్న అభిమానుల్ని గురించి, ప్రత్యేకంగా ఇండియా వైడ్‌గా క్రికెట్‌ని అభిమానించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇదే స్థాయిలో కాకపోయినా కొంత వరకు కుస్తీ కూడా ఆసక్తిని రేకెత్తించిన క్రిడే. `దంగల్` తరువాత దీనిపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఈ రెండు నేపథ్యాల్లో వచ్చిన సినిమాలు `లగాన్, `దంగల్`.
బ్రిటీష్ వారితో పోటీపడి క్రికెట్ ఆడి విముక్తిని పొందే ఓ ప్రాంతం వారి కథగా రూపొందిన `లగాన్` ఆస్కార్ గడపదాకా వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక తను సాధించలేని లక్ష్యాలని తన కూతుళ్లు సాధిస్తారని వారికి కుస్తీ నేర్పించి బరిలోకి దించి వారితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కప్‌లని సాధించిన ఓ తండ్రి విజయ గాధగా `దంగల్`ని రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పడు ఈ రెండు సినిమాల్లోని పాపులర్ గేమ్స్‌ని `పెద్ది`లో చూపిస్తూ ఇప్పటికే అందరిలో అటెన్షన్‌ని క్రియేట్ చేసిన బుచ్చిబాబు అదిరిపోయే ప్లాన్ వేశాడని అంతా కామెంట్‌లు చేస్తున్నారు. ఇక్కడే సినిమా బ్లాక్ బస్టర్ అని తేలిపోయిందని, సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డులు సృష్టించడం ఖాయమని అంతా అంటున్నారు.