• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియా వైపు...

పాన్ ఇండియా వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ డైరెక్టర్స్..!

By - Tupaki Desk
Update: 2021-05-28 11:30 GMT
సౌత్ సినీ ఇండస్ట్రీలో టెక్నాలజీతో పాటు సినిమా ప్రామాణిక విలువలు కూడా మారిపోయాయి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతున్నవారు పాన్ ఇండియా సినిమాలు తీసేందుకు చాలా ఏళ్లు సమయం కేటాయిస్తున్నారు. అంటే దర్శకులుగా కెరీర్ ప్రారంభించిన వారు పాన్ ఇండియా ఫేమ్ అందుకోవడానికి చాలా ఏళ్లు వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఫస్ట్ మూవీతో సొంతభాషలో డెబ్యూ చేసిన వెంటనే సెకండ్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు. ఇదివరకు కొన్నేళ్లు అనుభవం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమాలు బాగా డీల్ చేయగలరని నమ్మేవారు. కానీ అలాంటి నమ్మకాలను మూఢనమ్మకాలుగా ప్రూవ్ చేస్తున్నారు నేటితరం డైరెక్టర్స్. సెకండ్ మూవీ వచ్చేసరికి బాషా పరిమితి లేకుండా పాన్ ఇండియా మూవీస్ రూపొందిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ అంటే రిస్క్ కావచ్చు. కానీ సక్సెస్ అయితే మాత్రం ఏ రెంజీలో నేమ్ ఫేమ్ వస్తుందో చెప్పలేం. అలా రిస్క్ చేసి ఫేమ్ అందుకున్న సౌత్ డైరెక్టర్స్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నవారు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి పేరు మొదటగా వినిపిస్తుంది. రాజమౌళి ఆల్రెడీ పాన్ ఇండియా రికార్డులు అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ బాటలో చాలామంది ఉన్నారు.

అలాంటి లిస్టులో 1. సుజీత్ - రన్ రాజా రన్ తర్వాత ప్రభాస్ హీరోగా సాహో అనే పాన్ ఇండియా మూవీ తీసాడు. కానీ తదుపరి సినిమా ఏంటనేది తెలియాల్సి ఉంది. 2. క్రిష్ - డైరెక్టర్ క్రిష్ పీరియడిక్ మూవీస్ తీయడంలో మంచి పట్టు ఉందని నిరూపించుకున్నాడు. మణికర్ణిక లాంటి హిట్ తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. 3. సుకుమార్ - ఇప్పటివరకు సుకుమార్ పాన్ ఇండియా మూవీస్ చేయలేదు. కానీ అలాంటి ఫేమ్ మాత్రం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాడు.

4. పూరీ జగన్నాథ్ - డాషింగ్ డైరెక్టర్ ఇప్పటివరకు తెలుగు - కన్నడ - హిందీ భాషల్లో సినిమాలు రూపొందించాడు. కానీ పాన్ ఇండియా చేయలేదు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాడు. 5. కొరటాల శివ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా మూవీ లైన్ చేసాడు. 6. నాగ్ అశ్విన్ - ఇప్పటివరకు దర్శకుడుగా నాగ్ తీసింది రెండు సినిమాలే. కానీ మూడో సినిమా మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేసాడు. డార్లింగ్ ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేసాడు.

8. త్రివిక్రమ్ - ఈయన సినిమాలు వేరే భాషల్లో కూడా డబ్ అవుతున్నాయి. కానీ త్వరలోనే మహేష్ బాబుతో తెరకెక్కించే మూవీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్నట్లు తెలుస్తుంది. 9. రాధాకృష్ణకుమార్ - జిల్ సినిమా తర్వాత రాధాకృష్ణ డార్లింగ్ ప్రభాస్ తో 'రాధేశ్యామ్' మూవీ రూపొందించాడు. ఆ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది. ఇలా ఈ లిస్టులో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు పేరు కూడా వినిపిస్తుంది. చూడాలి మరి మన డైరెక్టర్స్ ఎంతమంది పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటారో..!
Tags:    
  • Mahesh babu 
  • prabhas 
  • ntr 
  • ramcharan 
  • Vijay devarakonda 
  • pawan kalyan 
  • RRR 
  • Allu arjun 
  • Pushpa 
  • tollywood heros 
  • pan indian movies tollywood 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS