కథలు బాగున్నాయ్.. కానీ నమ్మేలా చెప్పండి

Update: 2018-02-05 17:30 GMT
ఈ మధ్యన ఓ స్టార్ కమెడియన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. వందలకొద్దీ సినిమాలు చేసిన ఈయనకు.. యాక్టింగ్ విషయంలో ఎవరికీ లేని ఓ రికార్డు కూడా ఉంది. ఒకప్పుడు స్క్రీన్ మీద ఈయన పేరు కనిపించినా.. మనిషి కనిపించినా జనాలు నవ్వేసేవారు. ఇప్పుడంత సీన్ లేకపోయినా.. డిమాండ్ బాగానే ఉంది. ఈయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కబుర్లు కూడా కామెడీ అయిపోతున్నాయి.

ఈయన గారు ఓ పాతికేళ్లుగా అసలు సినిమాలే చూడలేదట. సినిమాల్లో అన్నీ కృత్రిమం అనిపించేసి అలా చేస్తున్నారట. బహుశా.. ఇప్పటివరకూ తెలుగు సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద జోక్ ఎవరూ వేసి ఉండరు. ఎందుకంటే.. ఈ కమెడియన్ కోసమే సృష్టించిన పాత్రలు కొన్ని ఉన్నా.. ఈయన  చేసే సినిమాల్లో చాలా వరకూ స్పూఫ్ కామెడీలే. ఓ స్టార్ హీరో సినిమాలో.. మరో హీరో హిట్టు సినిమాని ప్యారడీ చేయడం వంటివి బోలెడన్ని కనిపిస్తాయి. స్పూఫ్ కామెడీల నుంచి తనకంటూ ప్రత్యేకమైన రేంజ్ కు ఎదిగి.. ఇప్పుడు అసలు సినిమాలే చూడలేదని జోకులేస్తున్నాడు ఈయన.

మరో పెద్ద హీరో ఉన్నాడు. ఈయనా అంతే.. తన తండ్రి సినిమాలు తప్ప మరేమీ చూడనని చెప్పడం ఆయనకు పరిపాటి. మరి ఏమీ చూడకుండానే.. అసలు టాలీవుడ్ సినిమా రంగం ఎలా మారుతుందనే సంగతిని పట్టించుకోకుండానే..  వీళ్ళు ఇతర సినిమాల్లోని ముఖ్యమైన సీన్ల గురించి అంతలా మాట్లాడేస్తున్నారా? అనే డౌట్ కు ఎవరొచ్చి ఆన్సర్ ఇస్తారు. ఏమైనా.. కామెడీలు చేయాలంటే.. ఎవరైనా సరే టాలీవుడ్ స్టార్స్ తర్వాతే!
Tags:    

Similar News