• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఎన్‌బీకే 107' కు టైటిల్...

'ఎన్‌బీకే 107' కు టైటిల్ లాక్‌.. ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే?

By - Tupaki Desk
Update: 2022-05-01 05:30 GMT
గ‌త కొంత కాలం నుంచీ స‌రైన స‌క్సెస్ లేక స‌త‌మ‌తం అవుతున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన `అఖండ‌`తో మ‌ళ్లీ ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేశారు. 2021 డిసెంబ‌ర్ 2న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి అటు నిర్మాత‌ల‌కు, ఇటు బ‌య్య‌ర్ల‌కు భారీ లాభాల‌ను అందించింది. ఈ మూవీ అనంత‌రం గోపీచంద్ మ‌లినేనితో బాల‌య్య త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అనే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ ఈ మూవీకి స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. మేక‌ర్స్ రెండో షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి టైటిల్ ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొన‌గా.. జై బాలయ్య, పెద్దన్నయ్య వంటి టైటిల్స్ తెర‌పైకి వ‌చ్చాయి. అయితే, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. `ఎన్‌బీకే 107` కు మేక‌ర్స్ `అన్నగారు` అనే టైటిల్ ను లాక్ చేశార‌ట‌. దీనిపై ఎటువంటి అధికారిక‌ ప్ర‌క‌ట‌న లేదు. కానీ, జూన్ 10న బాల‌య్య పుట్టిన రోజు. ఆయన బ‌ర్త్ డే ట్రీట్ గా `ఎన్‌బీకే 107` టీజ‌ర్ మ‌రియు టైటిల్ ను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవ‌డం ఖాయం.

కాగా, మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ ద్విపాత్రాభినయం చేయ‌నున్నాడ‌ని.. ఆయ‌న పోషించ‌బోయే రెండు పాత్ర‌లు వేటిక‌వే విభిన్నంగా ఉంటాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన బాల‌య్య ఫ‌స్ట్ లుక్ విశేషంగా ఆక‌ట్టుకుంది. అలాగే ఈ చిత్రంలో త‌మిళ న‌టి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతోంది.
Tags:    
  • Balakrishna 
  • NBK107 
  • Gopichand Malineni 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS