• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పరువు నష్టం కేసు...

పరువు నష్టం కేసు వేస్తున్న హీరో, డైరెక్టర్

By - Tupaki Desk
Update: 2016-07-14 07:00 GMT
బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా వివాదాల పరిష్కరానికి లీగల్ రూట్ ని ఎంచుకోరు. ఆ ప్రాసెస్ లో అయ్యే లేట్ కారణంగా కమిట్ మెంట్స్ మిస్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే సామరస్యంగా పరిష్కారానికి ప్రయత్నిస్తారు. కానీ హీరో టైగర్ ష్రాఫ్.. దర్శకుడు సబ్బీర్ ఖాన్ లు మాత్రం ఓ వివాదం విషయంలో పరువు నష్టం దావా వేసేందుకు రెడీ అవుతున్నారు.

కృతిక్ కుమార్ పాండే అనే ఔత్సాహిక ఫిలిం మేకర్.. ఈ మధ్య వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఓ కంప్లెయిట్ చేశాడు. టైగర్ ష్రాఫ్ - సబ్బీర్ ఖాన్ లు తెరకెక్కించనున్న 'మున్నా మైకేల్' చిత్రం తన స్టోరీ లైన్ అన్నది కృతిక్ చేసిన ఫిర్యాదు. ఓ ఏడాది క్రితం తాను టైగర్ ష్రాఫ్ ను కలిసి ఓ స్టోరీ చెప్పానని.. ఈ ప్రాజెక్ట్ చేద్దామంటూ తనను తిప్పుకున్న టైగర్ ష్రాఫ్.. ఇప్పుడు అదే తరహా స్టోరీ లైన్ తో సబ్బీర్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని ఫిర్యాదులో తెలిపాడు. 'ఎంజీ రిటర్న్' పేరుతో తాను సినిమా తీద్దామని అనుకుంటే.. ఇప్పుడు వీళ్లిద్దరూ మోసం చేశారని చెప్పాడు కృతిక్.

అయితే అసలు కృతిక్ కుమార్ పాండే అనే వ్యక్తి ఎవరో తమకు తెలీదని.. కేవలం పబ్లిసిటీ కోసం తమ పరువు తీసేందుకు అతడు సిద్ధమయ్యాడన్నది టైగర్ ష్రాఫ్.. సబ్బీర్ ఖాన్ ల వెర్షన్. ఇలాంటి వాటిని నిలువరించాలంటే.. లీగల్ గా చర్యలు తీసుకోవడం తప్పని సరి అని భావించండంతో.. పరువు నష్టం దావా వేసేందుకు లాయర్లతో చర్చిస్తున్నారు.
Tags:    
  • Tiger Shroff 
  • Sabbir Khan 
  • Defamation suit 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS