టికెట్లు రేట్ల వివాదం: రఘురామతో నట్టికుమార్ ఫైట్
ఏపీలో సినిమా టికెట్ రేట్లపై పడ్డాడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ ను టార్గెట్ చేసి రచ్చ చేస్తున్న రఘురామ తాజాగా ఏపీ ప్రభుత్వం నిబంధనలు పెట్టిన సినిమా టికెట్ రేట్లపై పడ్డాడు. ఆ విషయాన్ని రచ్చ చేసే యోచనలో పడ్డాడు.
ఏపీలో సినిమా టికెట్ రేట్లపై ఎంపీ రఘురామ హాట్ కామెంట్స్ చేశాడు. సీఎం జగన్ చడ్డీలు వేసుకున్న నాటి టికెట్ రేట్లను ఇప్పుడు కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించాడు. ఈ విమర్శలపై సినీ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు.
ఎంపీ రఘురామకు సినీ పరిశ్రమలోని కొంతమందితో పరిచయాలు ఉండవచ్చని.. అంత మాత్రాన సినీ రంగంలోని సమస్యలపై సంపూర్ణ అవగాహన లేకుండా కేవలం విమర్శించాలన్న ఉద్దేశంతో మాట్లాడడం బాధ్యతారాహిత్యమని నట్టి కుమార్ అన్నారు.
జీవో 35కు వ్యతిరేకంగా టికెట్ రేట్లు 200,300 రూపాయలు ఉండాలంటూ రఘురామ సపోర్ట్ చేస్తున్నారని.. ఇది ప్రేక్షకులకు ఎంత మాత్రం ఇష్టం లేదని నట్టి కుమార్అన్నారు. కొందరు సినీ ప్రముఖులు రఘురామకృష్ణంరాజుతో తమకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని నట్టి కుమార్ ధ్వజమెత్తారు. సదురు ఎంపీకి బహిరంగ సవాల్ చేశారు. ‘టికెట్ రేట్లపై చర్చిద్దామని.. ఓడిపోతే పాలాభిషేకం చేస్తానని’ నట్టికుమార్ తొడగొట్టారు. ఆయన ఎంపీగా గెలిచిన నరసాపురంలోనే ప్రజల మధ్య టికెట్ రేట్లపై చర్చ పెడుదాం అని నట్టి అన్నారు.
ఎవరు కరెక్టో తేల్చుకునేందుకు నాతో కలిసి వస్తారా? నా చాలెంజ్ స్వీకరిస్తారా? అని నట్టి సవాల్ చేశారు. రఘురామ ప్రజాకోర్టులో ఓడిపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నేను ఓడిపోతే ఆయనకు ప్రజా సమక్షంలో పాలాభిషేకం చేస్తానని స్పష్టం చేశారు.
ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ఉపసంహరించకూడదని జగన్ ను కోరడానికి సిద్దమయ్యారు. ఇక చిన్న నిర్మాతలకు ప్రాతినిధ్యం లేకుండా చిరంజీవి వెళుతున్నారని.. అందుకే తాను చిన్న నిర్మాతలతో వెళ్లి కలుస్తానని నట్టి కుమార్ అంటున్నాడు. ఇప్పుడీ వివాదం టాలీవుడ్ లో సెగలు రేపుతోంది. రాజకీయంగానూ వేడి పుట్టిస్తోంది.