• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చై-సామ్ విడాకుల...

చై-సామ్ విడాకుల వ్యవహారంలో హద్దులు మీరుతున్న థంబ్ నెయిల్స్ బ్యాచ్..!

By - Tupaki Desk
Update: 2021-10-06 14:30 GMT
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడిపోతున్నారనే విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. చై-సామ్ మధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారని అనేక ఊహాగానాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవలే తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు చైతన్య - సమంత జంట. ఇకపై తాము భార్యభర్తలుగా ఉండబోవడం లేదని.. స్నేహితుల్లా కలిసి ఉంటామని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా చై-సామ్ విడాకుల వ్యవహారానికి సంబంధించిన విషయాలే వినిపిస్తున్నాయి.

ప్రేమ వివాహం చేసుకొని ఎంతో అన్యోన్యంగా గడిపిన నాగచైతన్య - సమంత దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని అందరూ షాక్ అయ్యారు. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జోడీ ఉన్నట్టుండి విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చై-సామ్ డివోర్స్ మ్యాటర్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ క్రమంలో కొందరు ఈ వ్యవహారం పై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ హద్దులు మీరుతున్నారు. ఎంత సెలబ్రిటీలు అయినా వాళ్లకూ వ్యక్తిగత జీవితం ఉంటుందనే విషయం మరిచి కట్టు కథలు అల్లుతూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడే ఈ కష్ట సమయంలో అభిమానులు మద్దతు కావాలని.. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని శ్రేయోభిలాషులు, మీడియాకు చైతన్య - సమంత జంట విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ స్టార్ కపుల్ విడాకుల వ్యవహారం మీద అనేక పుకార్లు షికారు చేసేలా చేస్తున్నారు. ఇక యూట్యూబ్ లో సంబంధం లేని టైటిల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ బ్యాచ్ అయితే రెచ్చిపోతున్నారు. ఇంట్రెస్టింగ్ గా థంబ్ నెయిల్ పెడితేనే వ్యూవ్స్ వస్తాయకునే ఉద్దేశ్యంతో ఇతరుల పర్సనల్ లైఫ్ మీద రాళ్లేస్తున్నామనే సంగతి మరిచి ప్రవర్తిస్తున్నారు.

చై సామ్ విడాకులకు సంబంధించిన ప్రతి వీడియోకు కకూడా డబుల్ మీనింగ్ టైటిల్స్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పని కట్టుకొని ఇదే ఇష్యూ మీద వీడియోలు రన్ చేస్తున్నారు. సెలబ్రెటీల జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పబ్లిక్ లైఫ్ లో ఉన్నంత మాత్రాన వారికీ వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయనేది మనం గుర్తించాలి. నాగచైతన్య - సమంత ఇద్దరూ అనేక చర్చలు, ఆలోచనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య ఏమి జరిగిందనేది ఎవరికి తెలియదు. వారిద్దరికీ.. ఇరువిరి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ కారణాలు తెలిసి ఉంటాయి.

కానీ నాగ చైతన్య - సమంత ల నాలుగేళ్ళ జీవితాన్ని చాలా దగ్గరగా చేసినట్లుగా వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఇవేనని చెబుతూ యూట్యూబ్ లో అనేక వీడియోలు దర్శనమిస్తున్నారు. కొందరు చైతూ వల్ల వ్యవహారం విడాకుల దాకా వచ్చిందంటే మరికొందరు సమంత బిహేవియర్ వల్ల వచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలో ఇంకొందరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఇక చై సామ్ తీసుకున్న నిర్ణయం మీద పలువురు సినీ ప్రముఖులు కూడా దీని మీద స్పందిస్తున్నారు. వారిలో కొంతమంది ఇద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం వారి పర్సనల్ లైఫ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

నటి మాధవీ లత సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. సమంత ను ఓ రోబోట్ లా, డబ్బులు సంపాదించే మనీ మెషీన్ లా ఆమె కుటుంబం ట్రీట్ చేసిందని ఆరోపించింది. ఆఫర్స్ రావని తల్లి అవ్వాలనే సామ్ ఆశను కూడా చంపేసారని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అలానే సీనియర్ జర్నలిస్ట్ ప్రియ.. సమంత సరోగసీ ద్వారా బిడ్డను కనాలని అనుకోవడం.. మూడో వ్యక్తి వారి జీవితంలోకి ప్రవేశించడం వల్లనే ఇదంతా జరిగిందని చెబుతోంది. ఇలా చాలా మంది చైతన్య - సమంత ల విడాకుల మీద విశ్లేషణలు చేస్తూ వారి గోప్యతకు మరింత భంగం కలిగిస్తున్నారు. దీని వల్ల వారితో పాటుగా వారి కుటుంబాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు.

ఏదేమైనా సమంత - నాగచైతన్య ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఇకపై ఎవరి దారుల్లో వారు ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి మధ్య ఏమి జరిగినా.. వారి పర్సనల్ విషయాలు బయటకు చెప్పాలని లేదు. అలా చేయలేదు కాబట్టి వారి జీవితాలను ఇలా యూట్యూబ్ లో పెట్టాలను కోవడం ఎంతమాత్రం సమంజసం కాదు.


Tags:    
  • Samantha 
  • Naga Chaitanya 
  • Announce 
  • Divorce 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS