త్రోబ్యాక్ పిక్ః ప‌వ‌న్ మేక‌ప్ సెట్ చేస్తున్న చిరు ఆనందంలో ఫ్యాన్స్‌!

Update: 2021-04-08 15:05 GMT
వ‌ర్త‌మానం ఎప్పుడూ సాధార‌ణంగానే ఉంటుంది. కానీ, అది గ‌తంగా మారిపోయిన‌ప్పుడు.. దాన్ని భ‌విష్య‌త్ లో త‌ర‌చి చూసుకున్న‌ప్పుడు ఎంత గొప్ప‌గా ఉంటుందంటే.. ఇదిగో పై ఫొటో అంత అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి చిత్రాలను చూసిన‌ప్పుడు మ‌న‌సు పొర‌ల్లో దాగిన అల‌నాటి జ్ఞాప‌కాల‌న్నీ సీతాకోక చిలుక‌ల్లా విహ‌రిస్తుంటాయి. ఇప్పుడు మెగాస్టార్ ఇదే అనుభూతిని పొందుతున్నారు.

త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కు దూర‌మై మూడేళ్లు గ‌డిచిపోయాయి. ప‌వ‌ర్ స్టార్ సినిమాకోసం ఫ్యాన్స్ ఎంత‌లా వెయిట్ చేస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అందులో తాను కూడా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు అన్న‌య్య‌. అంతేకాదు.. త‌మ్ముడిని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసిన తొలినాళ్ల చిత్రాన్ని షేర్ చేసి ఆనందంతో కూడి భావోద్వేగానికి గుర‌య్యారు చిరంజీవి.

''చాలా కాలం తర్వాత పవన్ ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. అమ్మ‌, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రేపు సాయంత్రం థియేట‌ర్లో వ‌కీల్ సాబ్ చూస్తున్నాను.'' అని ట్వీట్ చేశారు మెగాస్టార్. అంతేకాకుండా.. తమ్ముడికి హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్న త్రోబ్యాక్ పిక్ ను షేర్ చేసి ''ఈ సినిమాపై నా స్పందన తెలియజేయడానికి వెయిట్ చేయలేకపోతున్నా..'' అంటూ ముగించారు చిరు.

ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఆ పాత మ‌ధురంగా ఉన్న చిత్రాన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జ‌యిట్ అవుతున్నారు. ఈ చిత్రంలో బ్లాక్ లెద‌ర్ జాకెట్స్ తో ఉన్నారు అన్నాద‌మ్ములు. దీన్ని చూస్తుంటే.. అక్క‌డ‌మ్మాయి ఇక్క‌డ‌బ్బాయి సినిమా మేకింగ్ సంద‌ర్భంగా తీసిన పిక్ అయి ఉంటుంద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.
Tags:    

Similar News