#త్రోబ్యాక్.. చెర్రీతో మెగా న్యూఏజ్ హీరోలు

Update: 2021-05-20 00:30 GMT
మెగాస్టార్ చిరంజీవి 60 ప్ల‌స్ లోనూ న‌వ‌త‌రం హీరోల‌కు ధీటుగా కెరీర్ ని సాగిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆయ‌న కుటుంబ బంధాలు అనుబంధాల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఇక మెగా మేన‌ల్లుళ్ల‌తో చిరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఆ సాంప్ర‌దాయాన్ని మెగా వార‌సుడు రామ్ చరణ్ కూడా కొన‌సాగిస్తున్నారు. ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్నా త‌న క‌జిన్స్ తో క‌లిసి అప్పుడ‌ప్పుడు చిలౌట్ పార్టీల్లో మునిగి తేలుతుంటారు.

బ్ర‌ద‌ర్ వ‌రుణ్ తేజ్ - సోద‌రి నిహారిక  చెర్రీతో ఇలా రేర్ క్లిక్ లో క‌నిపించారు. వీళ్ల‌తో పాటే మెగా మేన‌ల్లుళ్లు సాయితేజ్- వైష్ణవ్ తేజ్ కూడా ఈ ఫోటోలో ఉన్నారు. చెర్రీ స్టైలిష్ గా రేబాన్ ధ‌రించి స్మైలిస్తూ క‌నిపించారు. ఇక నిహారిక కొణిదెల గ్రూప్ ఫోటోలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇది చాలా కాలం క్రితం ఫోటో. అప్ప‌టికి వైష్ణ‌వ్ తేజ్ హీరో కాలేదు. ఇప్పుడు అత‌డు మొద‌టి సినిమాతోనే సెంచ‌రీ(100కోట్ల క్ల‌బ్) కొట్టిన హీరో.

ప్ర‌స్తుతం మెగా హీరోలంతా కోవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల షూటింగుల‌కు బ్రేక్ ఇచ్చారు. చ‌ర‌ణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ. వ‌రుణ్ త‌న కెరీర్ 10వ చిత్రం గ‌ని చేస్తున్నాడు. సాయి తేజ్ దేవాక‌ట్టాతో రిప‌బ్లిక్ రిలీజ్ కోసం వెయిటింగ్. నీహారిక పెళ్లాడాక మరో సినిమాని ప్ర‌క‌టించ‌లేదు. అట్నుంచి ఏదైనా అప్ డేట్ వ‌స్తుందనే అభిమానులు వేచి చూస్తున్నారు. ఉప్పెన త‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్ చ‌క‌చ‌కా సంత‌కాలు చేస్తూ కెరీర్ ప్లానింగులో ఉన్నాడు.
Tags:    

Similar News