వాట్ నెక్స్ట్ హీరో అంటే అన్సర్ ఇదే!
అనీల్ తో సినిమా అంటే అతడి సక్సెస్ ట్రాక్ చూసి ఏ స్టార్ హీరో అయినా ముందుకొస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ హీరోలు ఖాళీగా ఉండాలి.;
హిట్ మెషిన్ అనీల్ రావిపూడి తదుపరి హీరోపై అప్పుడే చర్చ మొదలైంది. అనీల్ ఏ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తాడు? ఏ హీరో డేట్లు ఇస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు? ఎప్పుడు మొదలు పెడతాడు? అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా వీటిలో కొన్నింటిపై క్లారిటీ వచ్చేసింది. అనీల్ ఫలనా హీరోతోనే సినిమా చేయాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు. తాను సిద్దం చేసుకున్న కథకు అప్పటికి ఏ హీరో ఖాళీగా ఉంటాడో చూసుకుని..ఆ స్టోరీ అతడి కి సెట్ అవుతుందంటే? ముందుకెళ్లిపోవడమే అన్నాడు. స్టోరీల పరంగా చూసుకుంటే? తనకు బాగా పట్టున్న జానర్లోనే సినిమా చేస్తాడు తప్ప ప్రయోగాలకు వెళ్లనన్నాడు.
అనీల్ తో సినిమా అంటే అతడి సక్సెస్ ట్రాక్ చూసి ఏ స్టార్ హీరో అయినా ముందుకొస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ హీరోలు ఖాళీగా ఉండాలి. అప్పుడే అది సాధ్యయమవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లు అంతా బిజీగా ఉన్నారు. వాళ్లెవ్వరికీ అనీల్ తో పనిచేసే సమయం లేదు. మరో ఏడాదిన రెండేళ్లపాటు ఇదే సన్నివేశం ఉంటుంది. సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవిలతో ఇప్పటికే పని చేసారు. ఇప్పట్లో వాళ్లతో మరో సినిమా చేసే అవకాశం లేదు. వీళ్లలో మిగిలిన సీనియర్ ఎవరైనా ఉన్నారా అంటే కింగ్ నాగార్జున ఒక్కరే.
ఆయనతో కూడా సినిమా చేస్తానని అనీల్ ప్రకటించాడు. కానీ అదెప్పుడు? అన్నది పక్కగా వెల్లడించలేదు. ప్రస్తుతం నాగార్జున హీరోగా రా కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఏడాది మిడ్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అనీల్ తదుపరి ప్రాజెక్ట్ నాగార్జున తో సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున ఇమేజ్ కు తగ్గ కథ సిద్దంగా ఉంది అంటే అనీల్ మరో ఆలోచన లేకుండా ముందుకెళ్లిపోతాడు. ఒకవేళ నాగార్జున మిస్ అయితే ? అందుకు ఆస్కారం ఉన్న హీరోలు ఎవరు అంటే? టైర్ -2 హీరోలకు ఛాన్స్ ఉంటుంది.
నాగచైతన్య, రామ్, నితిన్, విజయ్ దేవరకొండ, అఖిల్, కల్యాణ్ రామ్ లాంటి స్టార్లతో ఛాన్సెస్ తీసుకోవచ్చు. కళ్యాణ్ రామ్ తో అనీల్ కు మరో సినిమా కమిట్ మెంట్ ఉంది. `పటాస్` సినిమాతో అనీల్ ని డైరెక్టర్ గా పరిచయం చేసింది కళ్యాణ్ రామ్ అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంతోనే అనీల్ ట్యాలెంట్ బయట పడింది. ఆ విజయం అనీల్ జీవితాన్నే మార్చేసింది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కోసం అనీల్ మరోసారి రంగంలోకి దిగిన ఆశ్చర్యపో వాల్సిన పనిలేదు. `పటాస్` కి సీక్వెల్ గా `పటాస్ 2` చేయాలని అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు. నాగ్ తో సెట్ అవ్వకపోతే గనుక కళ్యాణ్ రామ్ తో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి అంతిమంగా హిట్ మెషిన్ తో ఛాన్స్ ఏ హీరో అందుకుంటాడో చూడాలి.