ఖుషీ కపూర్ బెస్ట్ ఫ్రెండ్ పార్టీలో ఈ షాడో ఎవరు?
తన మంచి ఇండస్ట్రీ స్నేహితులను ఖుషీ ఎప్పుడూ వదిలి ఉండదు. ఖుషీ ఇప్పుడు తన ప్రాణస్నేహితురాలు ఆలియా కశ్యప్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీకపూర్ వరుస ప్రాజెక్టులతో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోను జాన్వీ హవా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో జాన్వీ సోదరి, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో తన లక్ చెక్ చేసుకుంటోంది. కానీ ఇంకా ఆ ఒక్క హిట్టు అందని ద్రాక్షగానే ఉంది.
2025 ఖుషీని ఏమాత్రం ఖుషీ చేయలేదు. ఇది నిజంగా ఫ్లాప్ ఇయర్. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటించిన `నాదనియాన్`, ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటించిన `లవ్ యాపా` ఆశించిన విజయాల్ని సాధించకపోయినా, ఖుషీ తనను తాను విశ్లేషించుకునేందుకు ఈ అనుభవాలు చాలు. ఒక నటవారసురాలిగా తనకు ఉన్న బ్యాకింగ్ దృష్ట్యా, అవకాశాల పరంగా తనకు వచ్చిన ఇబ్బేందేమీ లేదు.
అయితే ఖుషీ నిరంతరం లైమ్ లైట్ లో ఎలా ఉండాలో తెలిసిన జెన్ జెడ్ కిడ్. అందువల్ల సోషల్ మీడియాల్లో తన క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. అలాగే ఇండస్ట్రీ స్నేహాలు, పార్టీ క్రౌడ్స్ లో షో స్టాపర్ గా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఫ్యాషనిస్టాగాను వెలిగిపోతోంది. ఖుషీ కపూర్ తన స్టైలిష్ లుక్స్‌తో `జెన్-జెడ్` ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందింది. నిరంతర ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, ఫ్యాషన్ ఈవెంట్లలో ఖుషీ ధరించే దుస్తులు నిత్యం ట్రెండింగ్‌లో ఉంటాయి.
తన మంచి ఇండస్ట్రీ స్నేహితులను ఖుషీ ఎప్పుడూ వదిలి ఉండదు. ఖుషీ ఇప్పుడు తన ప్రాణస్నేహితురాలు ఆలియా కశ్యప్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆలియా కశ్యప్ ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అనే విషయం తెలిసిందే. ఖుషీ - ఆలియా చిన్ననాటి నుండి ప్రాణస్నేహితులు. ఈ బెస్టీలు చాలాసార్లు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
ఆలియా 25వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఖుషీ ఒక స్వీట్ మెసేజ్ ని పంపింది. ``మై బెస్టీ, చీర్ లీడర్ .. ప్రతిదీ నువ్వే.. నీకు బర్త్ డే శుభాకాంక్షలు`` అని తెలిపింది. ఆలియా కశ్యప్ బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎంతో ఎనర్జిటిక్ గా ఇస్మార్ట్ గా కనిపిస్తున్నారు. ఇందులో బోయ్స్ & గాళ్స్ చిల్లింగ్ గా ఫోటోలకు ఫోజులివ్వడం ఆకర్షిస్తోంది. గాళ్స్ గ్యాంగ్ తో యథావిధిగా ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అయితే ఇదే గ్యాంగ్ లో ఆ షాడో మ్యాన్ ఎవరో కానీ, ఇస్మార్ట్ లుక్ తో గుబులు పుట్టిస్తున్నాడు.
ప్రియుడితో బ్రేకప్ నిజమా?
ఖుషీ కపూర్ తన సహనటుడు వేదంగ్ రైనాతో ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా కథనాలొస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాలో ఖుషీ కపూర్- వేదంగ్ రైనా బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ అందమైన జంట `ది ఆర్చీస్` సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి డేటింగ్‌లో ఉన్నారని అందరూ భావించారు. తాజా సమాచారం మేరకు.. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు బాలీవుడ్ మీడియాలలో కథనాలొస్తున్నాయి. అందుకే ఖుషీ తన బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో ఒంటరిగా కనిపించింది. కేవలం ఇతర స్నేహితులతో కలిసి ఎక్కువగా కనిపించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ఖుషీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తన తల్లి శ్రీదేవి నటించిన `మామ్` సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న `మామ్ 2`లో కీర్తి అనే పాత్రలో ఖుషీ నటిస్తోంది. ఇది ఈ ఏడాది చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది.