ఆ అవ‌కాశాన్ని నేను ఎవ‌రి ద‌గ్గ‌రా లాక్కొని తీసుకోలేదు

సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌లో ఒక‌రైన సాయి సుషాంత్ రెడ్డి ఈ మూవీలో న‌టిస్తుండ‌క‌పోవ‌డంతో, ఆ క్యారెక్ట‌ర్ శ్రీనాథ్ మాగంటి వ‌ద్ద‌కు వెళ్లింద‌నే వార్త ఇప్ప‌టికే బ‌య‌టికొచ్చింది.;

Update: 2026-03-04 15:15 GMT

యూత్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సినిమాలు, వాటిలోని ఐకానిక్ పాత్రలు ఎప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. ఆ కాంబినేష‌న్ లో కొంచెం మార్పు వచ్చినా ఆడియ‌న్స్ దానిపై అసహనాన్ని వ్యక్తం చేస్తారు. గతంలో, ఈ ఫ్యానీ రియాక్షన్‌ ఎక్కువగా పాత వింటేజ్ బ్లాక్‌బస్టర్లను యంగ్ హీరోలు రీమేక్ చేసినప్పుడు ఎదుర‌వుతుండేది. ఇప్పుడు, ఇదే పరిస్థితి సీక్వెల్ సినిమాలకూ వర్తిస్తోంది.

త‌రుణ్ భాస్కర్ దర్శకత్వంలోని సూపర్‌హిట్ కల్ట్ మూవీ ఈ న‌గ‌రానికి ఏమైంది త్వ‌ర‌లో సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ‌గా బ్యాంకాక్‌లో జ‌ర‌గ‌నుంద‌ని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ మూవీలో విశ్వ‌క్సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కకుమాను గ‌త సినిమాలోని పాత్రల్లో కొనసాగుతుండ‌గా, ప్రధాన పాత్రల్లో ఓ మార్పు చోటు చేసుకుంది. సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌లో ఒక‌రైన సాయి సుషాంత్ రెడ్డి ఈ మూవీలో న‌టిస్తుండ‌క‌పోవ‌డంతో, ఆ క్యారెక్ట‌ర్ శ్రీనాథ్ మాగంటి వ‌ద్ద‌కు వెళ్లింద‌నే వార్త ఇప్ప‌టికే బ‌య‌టికొచ్చింది.

రియాక్ట్ అయిన శ్రీనాథ్

ఈ క్రమంలో, సాయి సుషాంత్ రెడ్డి పాత్ర‌లో శ్రీనాథ్ మాగంటి పేరుని డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి సోషల్ మీడియాలో శ్రీనాథ్ తీవ్రంగా ట్రోల్ చేయబడుతున్నారు. ఈ విషయంపై తాజాగా శ్రీనాథ్ మాగంటి రియాక్ట్ అయి, క్లారిటీ ఇచ్చారు. తాను సాయి సుషాంత్ రెడ్డి నుంచి ఆ క్యారెక్ట‌ర్ ను లాక్కుని తీసుకోలేదని, ఆయన సీక్వెల్‌లో న‌టించ‌కూడ‌ద‌ని అనుకోవ‌డంతోనే త‌న‌కు ఈ ఛాన్స్ వ‌చ్చింద‌ని, మొదట, ఈ క్యారెక్ట‌ర్ 30 Weds 21 ఫేమ్ చైతన్య రావ్‌కు వెళ్లింద‌ని, ఆయన అంగీకరించకపోవడంతో, ఆ అవకాశం త‌న‌కు ద‌క్కింద‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా ఆడియ‌న్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే మొదటి సినిమాలోని కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్.. సీక్వెల్‌లో కూడా ఆడియ‌న్స్ తో అనుభూతి చేయించాల్సిన స‌వాల్ డైరెక్ట‌ర్ ముందుంది. అయితే క్యాస్టింగ్ మార్పు వల్ల వ‌చ్చిన వివాదానికి శ్రీనాథ్ ఇచ్చిన క్లారిటీ, సీక్వెల్ పై ఆడియ‌న్స్ లో సానుకూల అంచనాలను పెంచే అవకాశాన్ని కలిగిస్తోంది. మ‌రి ఈ న‌గ‌రానికి ఏమైంది2 ప్రేక్షకుల ప్రేమ, ఆదరణను మళ్లీ సాధించగలదా అనేది చూడాలి.

Tags:    

Similar News