త‌దుప‌రి 1000 కోట్లు కొట్టేది వీళ్లేనా?

బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్ల విజ‌యాలు అందించిన ద‌ర్శ‌కులు ఎంత మంది అంటే? టాలీవుడ్ నుంచి రాజ‌మౌళి, నాగ్ అశ్విన్, సుకుమార్, ప్ర‌శాంత్ నీల్ పేర్లు క‌నిపిస్తాయి;

Update: 2026-01-10 13:30 GMT

బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్ల విజ‌యాలు అందించిన ద‌ర్శ‌కులు ఎంత మంది అంటే? టాలీవుడ్ నుంచి రాజ‌మౌళి, నాగ్ అశ్విన్, సుకుమార్, ప్ర‌శాంత్ నీల్ పేర్లు క‌నిపిస్తాయి. ఇక బాలీవుడ్ నుంచి చూసుకుంటే నితీష్ తివారీ, ఆదిత్య‌ధ‌ర్ మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. శాండిల్ వుడ్ నుంచి ప్ర‌శాంత్ నీల్ ఉన్నాడు. కోలీవుడ్ , మాలీవుడ్ నుంచి అయితే ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ లేరు. మ‌రి భ‌విష్య‌త్ లో 1000 కోట్ల వ‌సూళ్ల‌కు ఆస్కారం ఉన్న ద‌ర్శ‌కులు ఎవ‌రెవ‌రు? అంటే ప్ర‌ముఖంగా ఈ పేర్లు క‌నిపిస్తున్నాయి.

హ‌నురాఘ‌వ‌పూడి, సందీప్ రెడ్డి వంగా, గీతూ మోహ‌న్ దాస్, బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల‌, నెల్స‌న్ దిలీప్ క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా హ‌నురాఘ‌వపూడి `పౌజీ` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్రానికి ముందు జ‌రిగిన క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నాడు. ఇందులో అద్భుత‌మైన ల‌వ్ స్టోరీని కూడా హైలైట్ చేస్తూ భారీ వార్ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాడు. ప్ర‌భాస్ ఇమేజ్తో సినిమా కు హిట్ టాక్ వ‌చ్చిందంటే? బాక్సాఫీస్ వ‌ద్ద సునాయాసంగా 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిపోతుంది.

ఈ క్ల‌బ్ అన్న‌ది ప్ర‌భాస్ కి కొత్తేం కాదు. ఇక సందీప్ రెడ్డి వంగా అదే ప్ర‌భాస్ తో `స్పిరిట్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా హిట్ అయిందంటే? పాన్ ఇండియాలో వెయ్యికోట్ల వ‌సూళ్లు నాలుగైదు రోజుల్లోనే రాబ‌డుతుంది. సందీప్ గ‌త సినిమా `యానిమ‌ల్` 900 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో `స్పిరిట్` టార్గెట్ 2000 కోట్ల అంచ‌నాగా వినిపిస్తోంది. అలాగే క‌న్న‌డ స్టార్ య‌శ్ హీరోగా లేడీ డైరెక్ట‌ర్ గీతూమోహ‌న్ దాస్ `టాక్సిక్` ని ఏ రేంజ్ లో తెర‌కెక్కిస్తుందో? తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్ తోనే అర్ద‌మ‌వుతుంది.

బోల్డ్ అండ్ యాక్ష‌న్ టీజ‌ర్ తో అర‌ద‌గొట్టింది. ఒక్క టీజ‌ర్ తో అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. హిట్ టాక్ వ‌చ్చిందంటే ఇదీ వెయ్యి కోట్ల వ‌సూళ్ల చిత్ర‌మే. అలాగే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్స‌న్ దీలిప్ `జైల‌ర్` కి సీక్వెల్ గా `జైల‌ర్ 2`ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `జైల‌ర్` బాక్సాఫీస్ వ‌ద్ద 700 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన నేప‌థ్యంలో `జైల‌ర్ 2` సునాయాసంగా 1000 కోట్ల వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌నే అంచ‌నాలున్నాయి.

అదే జ‌రిగితో కోలీవుడ్ లో ఓ చ‌రిత్ర రాసిన‌ట్లే. ఇంకా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం `పెద్ది`ని బుచ్చిబాబు తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. పాన్ ఇండియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే 1000 కోట్ల క్ల‌బ్ పెద్ద విష‌యం కాదు. అదే జ‌రిగితే బుచ్చిబాబు గురువు సుకుమార్ ని మించిన శిష్యుడు అవుతాడు. రెండ‌వ సినిమాతోనే ఆఫీట్ ను అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డు సృష్టిస్తాడు.

అలాగే నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల `ది ప్యార‌డైజ్` ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ గ్లోబ‌ల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ డెబ్యూ `ద‌స‌రా` తోనే 100 కోట్ల వ‌సూళ్లు సాధించాడు. ఈ నేప‌థ్యంలో? `ప్యార్ డైజ్` తో ఇండియాను షేక్ చేస్తాడ‌నే అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.

Tags:    

Similar News