ఇండస్ట్రీ వీళ్లంద‌రి కోసం ఎదురు చూపు!

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా మ‌హేష్ దిగ్విజ‌యంగా తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-01-10 15:30 GMT

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా మ‌హేష్ దిగ్విజ‌యంగా తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కంటే ముందే కుమార్తె మంజుల ద‌ర్శ‌క‌, నిర్మాత‌, న‌టిగా ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. అయితే ఎంతో కాలం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగ‌లేదు. కొన్ని సినిమాలకు ప‌రిమిత‌మై కుటుంబ జీవితానికి అంకిత‌మ‌య్యారు. అదే కుటుం బం నుంచి కృష్ణ మ‌రో కుమార్తె త‌న‌యుడు, గ‌ల్లా జ‌య‌దేవ్ వార‌సుడు అశోక్ కూడా `దేవ‌కి నంద‌న వాసుదేవ` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రెండ‌వ ప్రాజెక్ట్ ఇంత వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు.

ఇప్పుడు అదే కుటుంబం నుంచి కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. `శ్రీనివాస మంగాపురం` టైటిల్ తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో అజ‌య్ భూప‌తి హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఇప్ప‌టికే జ‌య‌కృష్ణ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ అయింది. పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాకు మ‌హేష్ అన్ని ర‌కాలుగా మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. స్వ‌య‌నా అన్న‌య్య కొడుకు కావ‌డంతో? త‌న‌వైపు నుంచి అన్నిర‌కాలుగా స‌పోర్ట్ గా నిలుస్తున్నారు. జయకృష్ణ‌ను స్టార్ ను చేయాల్సిన బాధ్య‌త మ‌హేష్ పై కొంత వ‌ర‌కూ ఉంది.

జ‌య‌కృష్ణ పెద్ద స్టార్ అవుతాడ‌ని ఆ కుటుంబం ఎంతో న‌మ్ముతోంది. అదే కుటుంబం నుంచి భ‌విష్య‌త్ స్టార్ ఎవ‌రు? అంటే మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్ గా చెప్పొచ్చు. మ‌హేష్ వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల్సింది గౌత‌మ్. ప్ర‌స్తుతం అతడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. స్టార్ అవ్వ‌డానికి ఇంకా ఎలా లేద‌న్నా మ‌రో ఆరేడు సంవత్స‌రాలు ప‌డుతుంది. అలాగే త‌న‌య సితార‌కు సినిమాలంటే ఎంతో ఫ్యాష‌న్ . గౌతమ్ స్టార్ అవుతాడా? లేదా? అన్న‌ది ప‌క్కాగా చెప్ప‌లేం గానీ సితార‌ను లాంచ్ చేస్తే మాత్రం పెద్ద హీరోయిన్ అవుతుంది. ఆమె ఎంట్రీ విష‌యంలో ఇండ‌స్ట్రీ కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

ఈ విష‌యంలో సితార‌ను మ‌హేష్‌-న‌మ్ర‌త‌లు ప్రోత్స‌హించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. సితార కూడా చ‌దువుకుంటోంది. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత కెరీర్ పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. అలాగే మంజుల కుమార్తె జాన్వీ స్వ‌రూప్ 10 ఏళ్ల వ‌య‌సులోనే మ్యాక‌ప్ వేసుకుంది. మంజుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `మ‌న‌సుకు న‌చ్చింది` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత మ‌రో సినిమాకు ఛాన్స్ తీసుకోలేదు. కానీ ఇటీవ‌లే జాన్వీ కూడా హీరోయిన్ గా తెరంగేట్రం చేయ‌డానికి సిద్దంగా ఉంది అన్న విష‌యాన్ని మంజుల ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని మామ్ మీడియా ముఖంగా రివీల్ చేసారు. జాన్వీకి సంబంధించి ఫోటో షూట్ నెట్టింట వైర‌ల్ అయింది. అలాగే ర‌మేష్ బాబు కుమార్తె భార‌తి కూడా త్వ‌ర‌లో హీరోయిన్ గా అరంగేట్రం చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు తేజ కుమారుడు వెండి తెర‌కు హీరోగా ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.ఇందులో హీరోయిన్ గా భార‌తిని ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags:    

Similar News