థ్రిల్లర్లు ఊపందుకుంటున్నాయ్ బాస్
రీజనల్ స్థాయిలో థ్రిల్లర్ జానర్ అనగానే అది ఓ వర్గం ప్రేక్షకులకే పరిమితమైపోతుంది. స్టార్ హీరోలు థ్రిల్లర్ల జోలికి వెళ్లరు. దీంతో మీడియం, చిన్న స్థాయి హీరోలే ఈ జానర్ సినిమాల్లో నటిస్తుంటారు. ముఖ్యంగా తెలుగులో థ్రిల్లర్లు తెరకెక్కడం చాలా తక్కువే. అందులోనూ అన్నీ కుదిరిన పర్ఫెక్ట్ థ్రిల్లర్స్ మరీ అరుదు. ఐతే ఈ మధ్య ఇండస్ట్రీలోనూ మార్పు వస్తోంది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. స్టార్ హీరోలు సైతం థ్రిల్లర్ల మీద కన్నేసే పరిస్థితి వస్తోంది.
రెండేళ్ల కిందట మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ థ్రిల్లర్ అని చెప్పాలి. మహేష్ లాంటి స్టార్ ఇలాంటి థ్రిల్లర్లో నటించడం విశేషమే. ఇది ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ థ్రిల్లర్లలో ఒకటని ఐఎండీబీ గుర్తించడం విశేషం. కొన్ని కారణాల వల్ల సినిమా అప్పుడు ఆడలేదు కానీ.. థ్రిల్లర్ ప్రియులు ఇప్పుడు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మలయాళ థ్రిల్లర్ ‘దృశ్యం’ రీమేక్ లో నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. ఓ కుటుంబ కథలో థ్రిల్లర్ అంశాల్ని మిక్స్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది.
ఇక ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్షణం’ టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ అనిపించుకుంది. హాలీవుడ్ స్థాయి కథాకథనాలతో ఆశ్చర్యపరిచి కలెక్షన్ల వర్షం కురిపించుకుంది ‘క్షణం’. ఇక లేటెస్టుగా ‘జెంటిల్ మన్’ కూడా డీసెంట్ థ్రిల్లర్ అనిపించుకుంది. ఈ సినిమా రూ.20 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయబోతున్నట్లు అంచనా. ఈ సినిమాలో నాని హీరో కావడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సినిమా ఎక్కువ మందికి రీచ్ అయింది. మున్ముందు తెలుగులో మరిన్ని థ్రిల్లర్స్ రావడానికి ఈ సినిమా కారణమవుతుందనడంలో సందేహం లేదు.