శ్రుతి హాసన్ `డెకాయిట్` నుంచి తప్పుకున్నారా? నిర్మాత సుప్రియ క్లారిటీ!
అడివి శేష్ హీరోగా నటించిన భారీ యాక్షన్ డ్రామా `డెకాయిట్` ఇటీవల థియేటర్లలో విడుదలై యావరేజ్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.;
అడివి శేష్ హీరోగా నటించిన భారీ యాక్షన్ డ్రామా `డెకాయిట్` ఇటీవల థియేటర్లలో విడుదలై యావరేజ్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ ని తప్పించి మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసారా? అనేదానిపై చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో శేష్ - శ్రుతి కాంబినేషన్ చూసి అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే కాలక్రమంలో శ్రుతి తప్పుకోగా, మృణాల్ డెకాయిట్ టీమ్ తో చేరింది.
తాజాగా ఈ వార్తలపై నిర్మాత సుప్రియ యార్లగడ్డ స్పందించారు. ప్రముఖ జర్నలిస్టుతో ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ గురించి సుప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రుతి హాసన్ కంటే ముందే రెండేళ్ల క్రితం మృణాల్ ని ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నామని నిర్మాత సుప్రియ తెలిపారు. మొదట మృణాల్ కి కాల్షీట్ల సమస్య తలెత్తింది. ఆ తర్వాత శ్రుతి చేరినా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. చివరికి మృణాల్ టీమ్ తో చేరింది.. మృణాల్ డెకాయిట్ టీమ్ తో చేరడం డెస్టినీ అని నవ్వుకున్నామని సుప్రియ తెలిపారు.
డెకాయిట్ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించగా, ఇందులో శేష్, మృణాల్ నటనకు మంచి పేరొచ్చింది. కానీ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ - భరత్ కమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలై ఆడుతోంది. ఇదే సమయంలో తాజా ఇంటర్వ్యూలో సుప్రియ గూఢచారి 2 (జీ 2)తో డెకాయిట్ షెడ్యూల్స్ సింక్ కుదరకపోవడం గ్యాప్ గురించి కూడా మాట్లాడారు.
`గూఢచారి 2` చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయింది?
అడివి శేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `గూఢచారి`చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న`గూఢచారి 2` (జి2) ప్రస్తుతం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయిందని సమాచారం. మొదటి భాగం కంటే విజువల్స్ - మేకింగ్ పరంగా ఈ సీక్వెల్‌ను నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల యూరప్‌లోని కీలక ప్రాంతాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లలో తదుపరి షెడ్యూల్‌ను పూర్తి చేసారు. ఈ స్పై థ్రిల్లర్ కోసం అడివి శేష్ శారీరకంగా ఎంతో శ్రమిస్తూ... గూఢచారి పాత్రలో సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నారు.
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్ సరసన బానితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో యాక్షన్ , ఎమోషన్ రెండూ మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. అడివి శేష్ తరచుగా సెట్స్ నుండి అప్‌డేట్స్ ఇస్తూ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచుతున్నారు. అన్ని పనులు సజావుగా సాగితే ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ అంతర్జాతీయ స్థాయి స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.