ముగ్గురు సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ క్లాష్ లేనట్లే
కోలీవుడ్ సూపర్ స్టార్స్ రజినీకాంత్.. అజిత్ మరియు విజయ్ లు నటించిన సినిమాలు మూడు కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి. రజినీకాంత్ అన్నాత్తే ఇప్పటికే దీపావళికి ఫిక్స్ అయ్యింది. ఇక అజిత్ నటించిన వాలిమై సినిమాను కూడా దీపావళికి విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ వాలిమై సినిమాను సంక్రాతికి విడుదల చేయాలని కొత్త నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పటికే విజయ్ బెస్ట్ సినిమాను సంక్రాంతికి ఫిక్స్ చేసి ఉన్నారు. దాంతో అజిత్ మరియు విజయ్ ల క్లాష్ తప్పదని అంతా అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో విజయ్ మూవీని సంక్రాంతి బరి నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ మూవీని 2022 సమ్మర్ కు వాయిదా వేశారట. దాంతో ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా వేరు వేరుగానే రాబోతున్నారు... ఫైటింగ్ లేదని కన్ఫర్మ్ అయ్యింది.
ముగ్గురు పెద్ద హీరోలు ఒకే సారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఏ రేంజ్ లో హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనీసం ఇద్దరు స్టార్ హీరోలు అయినా పోటీ పడితే ఖచ్చితంగా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుంది. అందుకే ఇద్దరు హీరోలు కూడా పోటీ పడకుండానే రాజీ పడ్డారా లేదంటే విడుదలకు వీలు పడటం లేదో కాని ముగ్గురు హీరోలు కూడా మూడు విడుదల తేదీలను ఎంచుకున్నారు. ముగ్గురు హీరోల సినిమాలకు రెండు మూడు నెలల చొప్పున తేడా ఉంది కనుక అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. బెస్ట్.. వాలిమై.. అన్నాత్తే ఈ మూడు సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కనుక ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు కూడా పోటీ లేని సమయంలో రావడం చాలా మంచి పరిణామం అంటూ విమర్శకులు విశ్లేషకులు కోలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అన్నాత్తే నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు న్నారు. ఎందుకంటే ఈ మద్య కాలంలో రజినీకాంత్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఆయన రేంజ్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అందుకే అన్నాత్తే సినిమాను శివ మరో రేంజ్ లో చేయడం జరిగింది. ఇక సక్సెస్ కాంబోలో వాలిమై సినిమా రాబోతుంది. అజిత్ మరియు వినోథ్ ల కాంబోలో వచ్చిన గత చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాను కూడా బోనీ కపూర్ నిర్మించాడు. తెలుగు లో బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు విడి విడిగా వస్తున్న నేపథ్యంలో ఏ రేంజ్ లో వసూళ్లు నమోదు అవుతాయో చూడాలి.