జెంట్స్ వాష్‌రూమ్ వాడతాను.. లేడీ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్!
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన 'అలా మొదలైంది' సినిమాలో నిత్యామీనన్ జెంట్స్ టాయిలెట్‌లోకి వెళ్లడం, అక్కడ నానిని కలవడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆమె బయటపెట్టారు.;
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ నందిని రెడ్డి తాజాగా తన కొత్త సినిమా "దీవానా" సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. తన మొదటి సినిమా 'అలా మొదలైంది'లో హీరోయిన్ నిత్యామీనన్ పొరపాటున జెంట్స్ వాష్‌రూమ్‌లోకి వెళ్లే సీన్ నిజానికి తన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన అని ఆమె ఒప్పుకున్నారు. ఎంతో సరదాగా, బోల్డ్ గా ఆమె చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రియల్ లైఫ్ ఇన్సిడెంట్.. రీల్ లైఫ్ సీన్:
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన 'అలా మొదలైంది' సినిమాలో నిత్యామీనన్ జెంట్స్ టాయిలెట్‌లోకి వెళ్లడం, అక్కడ నానిని కలవడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆమె బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో దీని గురించి అడగ్గా.. "అవును, అది నా నిజ జీవితంలో చాలా సార్లు జరిగింది" అని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. లేడీస్ టాయిలెట్ ఫుల్ గా ఉన్నప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు, ఎవరూ లేరని చూసి జెంట్స్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి వచ్చేదాన్నని ఆమె చాలా ఓపెన్ గా చెప్పారు. ఈ విషయాన్ని ఆమె ఎక్కడా దాచుకోకుండా సరదాగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అప్పట్లో స్టూడియోల పరిస్థితి అలా ఉండేది:
తను ఎందుకు జెంట్స్ వాష్‌రూమ్స్ వాడాల్సి వచ్చిందో కూడా నందిని రెడ్డి వివరించారు. పూర్వం సినిమా స్టూడియోలలో కేవలం పురుషులకు మాత్రమే వాష్‌రూమ్స్ ఉండేవని, మహిళా టెక్నీషియన్లు చాలా తక్కువ మంది ఉండటం వల్ల లేడీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు ఉండేవి కావని, అప్పట్లో టెక్నీషియన్స్ అందరూ మగవారే ఉండటంతో, జెంట్స్ వాష్‌రూమ్స్ వాడటం తనకు అలవాటైపోయిందని చెప్పారు. షూటింగ్స్ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసేదాన్నని, ఆ తర్వాత బయట కూడా ఒకటి, రెండు సార్లు అలా చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
సినిమాలో నాని దొరికాడు.. కానీ రియల్ లైఫ్ లో?
అయితే ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు నందిని రెడ్డి. 'అలా మొదలైంది' సినిమాలో నిత్యామీనన్ కి జెంట్స్ వాష్‌రూమ్ లో నాని పరిచయం అవుతాడు, ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ తన నిజ జీవితంలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని ఆమె చమత్కరించారు. "సినిమాలో నిత్యామీనన్ కి నాని దొరికాడు కానీ, నా జీవితంలో ఇంకా నాని అంటే తనకి నచ్చే వ్యక్తి కలవలేదు" అంటూ తన సింగిల్ స్టేటస్ పై సెటైర్ వేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లను భలేగా అలరిస్తున్నాయి.
దీవానా మూవీపై నందిని రెడ్డి ధీమా:
ప్రస్తుతం నందిని రెడ్డి సమర్పణలో, హర్షిత్ రెడ్డి మరియు స్నేహ మణిమేగలై హీరోహీరోయిన్లుగా "దీవానా" అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంపై ఆమె చాలా నమ్మకంగా ఉన్నారు. తాజాగా విడుదలైన టీజర్ కు యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు సాంగ్ కూడ రిలీజ్ చేసారు. ఇక కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే నందిని రెడ్డి, ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూనే సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు.