లోకేష్ కనకరాజ్ టీమ్‌తో రామ్.. తమిళ మార్కెట్‌పై కన్నేసిన హీరో!
తాజా సమాచారం ప్రకారం, రామ్ ఒక కొత్త దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు.;
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, రామ్ ఒక కొత్త దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ దర్శకుడు ఇప్పటికే తమిళంలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నవాడు కావడం కమనర్హం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. న్యూ ఏజ్ ట్రీట్‌మెంట్‌తో ఈ కథను తెరకెక్కించబోతున్నారంట. కథలో కొత్తదనం, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైనల్ చర్చలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల రామ్ పోతినేని నటించిన “ఆంధ్ర కింగ్ తాలూకా” సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ, రామ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, రామ్ మాత్రం తన స్పీడ్ తగ్గించకుండా వరుస ప్రాజెక్ట్‌లతో ముందుకు వెళ్తున్నాడు.
ఇప్పటికే రామ్ మరో రెండు కొత్త సినిమాలను లైన్‌లో పెట్టినట్లు కూడా తెలుస్తోంది. అందులో ఈ లోకేష్ కనకరాజ్ అసోసియేట్‌తో చేసే సినిమా కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్‌తో రామ్ తమిళ మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. లోకేష్ కనకరాజ్ స్టైల్‌లో యాక్షన్, కథనం ఉంటే తమిళ ప్రేక్షకులకూ ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
మొత్తం పైన.. రామ్ పోతినేని కొత్త ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా ద్వారా రామ్ మరోసారి బలమైన కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.