‘కాటమరాయుడు’ వెనుక ఆ ముగ్గురు

Update: 2017-03-19 04:49 GMT
‘కాటమరాయుడు’ సినిమాలోకి దర్శకుడు డాలీ రావడానికి ముందే బౌండెడ్ స్క్రిప్టు రెడీ అయిపోయింది. అలాగని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తరహాలో పవన్ ఏమీ ఈ స్క్రిప్టులో జోక్యం చేసుకోలేదు. ఈ సినిమాకు మొదట అనుకున్న దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా స్క్రిప్ట్ వర్క్ పర్యవేక్షించాడు తప్ప అతనేమీ రాయలేదు. ఇది తమిళ హిట్ మూవీ ‘వీరం’కు రీమేక్ అయినప్పటికీ.. దాన్ని మక్కీకి మక్కీ ఏమీ దించేయలేదట. తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశారట. రీమేక్ అయినప్పటికీ ఒక స్ట్రెయిట్ మూవీ తరహాలో దీనికి స్క్రిప్టు తయారు చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం. మరి ఈ మార్పులన్నీ ఎవరు చేశారు.. స్క్రిప్టు ఎవరు రెడీ చేశారు.. అంటే సమాధానంగా ముగ్గురు పేర్లు చెప్పుకోవాలి.

ఇప్పటికే దర్శకులుగా పరిచయమైన ఇద్దరు.. మరో రచయిత కలిసి ‘కాటమరాయుడు’ స్క్రిప్టును తీర్చిదిద్దడం విశేషం. ‘జోష్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఆ తర్వాత ‘కృష్ణాష్టమి’ సినిమా తీసిన వాసు వర్మతో పాటు సుకుమార్ దగ్గర రచయితగా పని చేసి ‘చక్కిలిగింత’ అనే సినిమాతో దర్శకుడిగా మారిన వేమారెడ్డి.. వి.వి.వినాయక్ సినిమాలు చాలా వాటికి రచన అందించిన ఆకుల శివ ‘కాటమరాయుడు’కు పని చేశారు. ఈ ముగ్గురూ కలిసి ఆరు నెలలకు పైగా పని చేసి బౌండెడ్ స్క్రిప్టు రెడీ చేశారు. తర్వాత డాలీ వచ్చి చిన్న చిన్న మార్పులవీ చేయించుకుని సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు. స్క్రిప్టు పక్కాగా ఉండటంతో నాలుగు నెలల వ్యవధిలో సినిమాను పూర్తి చేసేయగలిగాడు డాలీ. మరి వీళ్లందరూ కలిసి వండిన ‘కాటమరాయుడు’ ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పిస్తుందో ఈ నెల 24న తేలుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News