మిర్రర్ ఫోజులతో గిలిగింతలు పెడుతున్న శర్వానంద్ బ్యూటీ!

చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.;

Update: 2025-12-08 03:45 GMT

చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తే.. మరి కొంతమంది మొదట హీరోయిన్గా చేసి ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమై.. మళ్లీ తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో గ్లామర్ వలకబోస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇంకొంతమంది భిన్నవిభిన్నమైన ఫోజులతో యువతకు గిలిగింతలు పెడుతున్నారని చెప్పవచ్చు.




 


ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 2014లో వచ్చిన రన్ రాజా రన్ అనే సినిమాతో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటించగా.. అడివి శేష్, కోటా శ్రీనివాసరావు , సంపత్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. మంచి విజయం అందుకోవడంతో శర్వానంద్ బ్యూటీగా మంచి పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఎవరో కాదు సీరత్ కపూర్.




 


1993 ఏప్రిల్ 3వ తేదీన వినీత్ కపూర్ , నీనా సిహోతా కపూర్ జంటకు ముంబైలో జన్మించింది.. తండ్రి హోటల్ యజమాని కాగా తల్లి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ముంబైలోని సాంతా క్రూజ్ లోని పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక విద్యను, బాంద్రా లోని ఆర్డి నేషనల్ కాలేజీలో మాధ్యమిక విద్యను పూర్తి చేసిన ఈమె బిఏ మాస్ కమ్యూనికేషన్ లో చేరి, సినిమాల కోసం డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసింది.




 


ఆ తర్వాత నృత్య వృత్తిలో ఉన్నత స్థాయికి చేరిన ఈమె 16 ఏళ్ల వయసులోనే ముంబైలోని డాన్స్ వర్క్స్ లో యాప్లే లోబో వద్ద బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టింది. అకాడమీలో నృత్య బోధకురాలిగా పనిచేసింది. అదే సమయంలో రాక్ స్టార్ సినిమాకు సహాయ నృత్య దర్శకురాలిగా కూడా పనిచేసింది.




 


ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం వంటి చిత్రాలలో నటించింది. గత ఏడాది భామాకలాపం 2, మనమే , ఉషా పరిణయం వంటి చిత్రాలలో నటించింది. ఈ మధ్య గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓసియన్ బ్లూ కలర్ డ్రెస్ ధరించి.. మిర్రర్ ముందు మత్తెక్కించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా సీరత్ కపూర్ షేర్ చేసిన సెల్ఫీ మిర్రర్ ఫోజులకు అభిమానులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా అమ్మడు గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News