సోనూ సూద్ కు ఒకేరోజు వేల ఫోన్ కాల్స్

Update: 2021-04-17 17:30 GMT
కరోనా మొదటి వేవ్ లో గత సంవత్సరం ఎంతో మందికి సహాయం చేసిన సోనూసూద్ పేద ప్రజల దృష్టిలో హీరో అయిపోయాడు. ఎంతో మంది వలస కార్మికులు బాధితులను స్వగ్రామానికి సొంత ఖర్చులతో పంపించాడు. అందరి మనసులు గెలుచుకున్నాడు. అయితే రెండో వేవ్ లో సోనూసూద్ కరోనా బారిన పడడం ఆయన అభిమానులను కలిచివేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న సోనూ సూద్ ఆచార్య మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నాడు. కాగా ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన వేళ ఆయనకు వేలల్లో ఫోన్ కాల్స్ వస్తున్నాయట.. ఆస్పత్రిలో బెడ్ లు, మెడిసిన్లు, ఇంజెక్షన్ల కోసం భారతదేశ నలమూలల నుంచి వేలసంఖ్యలో కాల్ లు వచ్చాయని.. ఇప్పటికే చాలా మందికి అందించానని.. కానీ చాలా నిస్సహాయంగా భావిస్తున్నానని.. పరిస్థితి భయానకంగా ఉందని  సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

అందరూ సెకండ్ వేవ్ వేళ ఇంట్లోనే ఉండండని.. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలని సోనూసూద్ సూచించారు. నేను తప్పకుండా వీలైనంత మందికి సహాయం చేస్తానని.. కానీ అది నా ఒక్కడితోనే సాధ్యం కాదని వివరణ ఇచ్చాడు. మనం కలిసి మరెన్నో ప్రాణాలను రక్షించగలమని ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపారు.

మీ సహాయం అవసరమైన పేదవారి కోసం ముందుకు రండి అని సోనూసూద్ పిలుపునిచ్చారు. పేదవారికి వైద్య అవసరాలను అందించడానికి ప్రయత్నించండని సోనూసూద్ వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News