క్రేజీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది

Update: 2021-06-08 16:30 GMT
హాలీవుడ్‌ మూవీ 'దోజ్ హు విష్‌ మీ డెడ్‌' మే 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున అమెరికాతో పాటు ఇతర దేశాల్లో థియేటర్లలో అదే సమయంలో ఓటీటీ లో విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఏంజిలినా జోలీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కోసం ఇండియన్‌ సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు నెల రోజుల తర్వాత తెర పడబోతుంది.

ఈ సినిమాను ఇండియాలో థియేటర్ల ద్వారా విడుదల చేయాలని భావించినా కూడా ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో చేసేది లేక ఈ సినిమా ను ఓటీటీ ద్వారాను విడుదల చేయాలని భావించారు. సినిమా ను మరీ ఆలస్యం చేయకుండా ఇంగ్లీష్ వర్షన్‌ లోనే ఈనెల 10వ తారీకున ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ ఆన్ లైన్‌ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్ ఫామ్‌ బుక్ మై షో ఇటీవల కాలంలో ఓటీటీగా కూడా రూపాంతరం చెందింది. ఈ క్రేజీ మూవీని బుక్ మై షో ద్వారా స్ట్రిమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్ ను బుక్ మై షో దక్కించుకుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ను పే పర్‌ వ్యూ పద్దతిన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
Tags:    

Similar News