ఆ క‌ళ్లు ముక్కు బుగ్గ సొట్ట‌ల ఎక్స్ ప్రెష‌న్ డిట్టో చిలిపి షారూకే!

Update: 2021-01-01 15:30 GMT
కింగ్ ఖాన్ షారూక్ ప్ర‌త్యేక‌త ఏమిటి? అంటే.. ఆ క‌ళ్లు ముక్కు చిరున‌వ్వు .. వీట‌న్నిటినీ మించి బుగ్గ సొట్ట‌ల ఎక్స్ ప్రెష‌న్!! అంటూ అభిమానులు వ‌ర్ణిస్తుంటారు. అల్ల‌రోడిగా చిలిపి ప్రేమికుడిగా న‌టించ‌మంటే షారూక్ జీవించేస్తాడు. డిట్టో చిలిపిత‌నం ఇప్పుడు  ఆయ‌న వార‌సురాలు సుహానా ఖాన్ లో క‌నిపిస్తోంది. సుహానా నాన్న కూచీ అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిన‌దే అయినా త‌నవైన ఏ ఎక్స్ ప్రెషన్స్ ప‌రిశీలించినా ఏ చిలిపి న‌వ్వు ప‌రిశీలించినా ఆ విష‌యం ఇట్టే బ‌య‌ట‌ప‌డుతోంది.

ఒక‌వేళ సుహానా న‌టిగా ఆరంగేట్రం చేస్తే త‌న తండ్రి ఇమేజ్ కి త‌గ్గ క‌థ- కాన్సెప్టు‌తో సినిమా తీస్తే అది అమాంతం త‌న‌ని పెద్ద స్టార్ ని చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం దేశంలో ట్రెండ్ మారుతోంది. వండ‌ర్ ఉమెన్.. సూప‌ర్ గాళ్ త‌ర‌హా క‌థాంశాల‌తో యూనివ‌ర్శ్ ని ఢొకొడుతున్నారు న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు. అస‌లు గ్లామ‌ర్ ఒల‌క‌బోత‌తో ప‌నే లేకుండా సుహానా ఈ రంగంలో నెగ్గుకు రావొచ్చు. అందుకు అవ‌స‌ర‌మైన స‌పోర్ట్ హోం బ్యాన‌ర్ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నుంచి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక సుహానా లేటెస్టుగా షేర్ చేసిన ఫోటో చూడ‌గానే కింగ్ ఖాన్ లోని వైబ్రేంట్ అప్పియ‌రెన్స్ మైమ‌రిపిస్తోంది. షారుఖ్ ఖాన్  20 ఏళ్ల కుమార్తె భ‌విష్య‌త్ లో బాలీవుడ్ ని ఏల్తుందా? అన్న‌ది ఇప్పుడు అంద‌రికీ క్వ‌శ్చ‌న్ మార్క్‌. కానీ అన్ని సందేహాల్ని తునాతున‌క‌లు చేసి అభిన‌వ తార‌గా సుహానా దూసుకొస్తుందా? అన్న‌ది చూడాలి.

తాజాగా వైట్ ఫుల్ స్లీవ్స్ .. హై నెక్ టాప్ తో స్కర్ట్ లో న్యూ ఇయర్ కానుక‌ను అభిమానుల‌కు పంపింది సుహానా. ఈసారికి పార్టీలు ఇంట్లోనే జరుపుకుంటున్న ఖాన్ అభిమానుల‌కు ఈ ట్రీట్ క‌చ్చితంగా సరిపోతుంది. సుహానా పోస్ట్ కు ఇప్ప‌టికే 2ల‌క్ష‌లు పైగా లైక్ ‌లు వచ్చాయి. ఫోటోపై త‌న స్నేహితులు అభిమానులు వారి వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు.  సుహానా స్నేహితుడు మహీప్ కపూర్.. సంజయ్ కపూర్ కుమార్తె షానయ సుహానా ఫోటోపై వ్యాఖ్య‌ల్ని జోడించారు.

ప్రస్తుతం న్యూయార్క్ ‌లో ఉన్న సుహానా ఎన్.‌వై.యూలో నట శిక్ష‌ణ తీసుకుంటోంది. సుహానా ఇదివ‌ర‌కూ అమెరికన్ స్నేహితులతో తన సమయాన్ని ఎలా స్పెండ్ చేసింది అన్న‌ది ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌గా చూశాం. `ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ` అనే లఘు చిత్రం ద్వారా సుహానా నటనా రంగ ప్రవేశం చేసింది. లండన్ ఆర్డింగ్లీ కాలేజీ నుండి పట్టా పొందిన తర్వాత ఈ చిత్రం వచ్చింది. ఆమె సహవిద్యార్థి థియోడర్ గిమెనో దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ఇది. అప్ప‌టికి సుహానా వ‌య‌సు 19 సంవత్సరాలు. ప్ర‌స్తుతం 22. ఇక క‌థానాయిక‌గా రంగ ప్ర‌వేశం చేసే వ‌య‌సొచ్చిందన్న‌ అభిమానుల ఆస‌క్తి ర‌చ్చ‌కు తెర తీస్తోంది.
Tags:    

Similar News