• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సురేష్ గీతల స్ట్రాటజీ...

సురేష్ గీతల స్ట్రాటజీ అదేనా ?

By - Tupaki Desk
Update: 2019-06-07 06:11 GMT
ఒకప్పుడు టాలీవుడ్ లోనే అతి పెద్ద బ్యానర్లుగా నిలిచిన సురేష్ ప్రొడక్షన్స్ గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు ఇటీవలి కాలంలో సినిమాల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అప్పటి తరహలో కేవలం కాంబినేషన్ల ఆధారంగా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడటం లేదు. అందులోనూ ముఖ్యంగా సురేష్ బాబు ఇటీవలి కాలంలో ఎక్కువగా చిన్న సినిమాలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

తాను ప్రొడ్యూస్ చేసే బదులు ఆల్రెడీ పూర్తైపోయి లేదా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలకు చేయూత నిచ్చి తన బ్యానర్ పేరుని జోడించి తద్వారా వాటికీ మంచి రిలీజ్ వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వచ్చేసిన ఫలక్ నుమా దాస్ ఎబిసిడి లాంటి సినిమాలతో మొదలుకుని రానున్న ఓ బేబీ-దొరసాని లాంటి మీడియం రేంజ్ మూవీస్ అన్ని ఆయనే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

మరోవైపు కేవలం బడ్జెట్ సినిమాల కోసమే గీత ఆర్ట్స్ 2 అంటూ మరో బ్యానర్ తో నిర్మాణం కొనసాగిస్తున్న అల్లు అరవింద్ ఇంత దూకుడుగా లేకపోయనా అటు ఇటుగా ఇదే తరహా స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. అయితే ముందుగానే డైరెక్టర్లను లాక్ చేసుకోవడం ఈయన శైలి. ఈ కారణంగానే గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా పరశురాం ఏడాది పాటు ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొత్తది ఖరారు కానే లేదు. ఇలాంటి బడా సంస్థలు అవలంబిస్తున్న శైలి ప్రోత్సాహకరంగా ఉన్నా కొత్త నిర్మాతల మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఆలోచించాల్సిన విషయమే.

వీళ్ళలో ఎవరు ఒకరు కొంటారులే అని గుడ్డిగా సినిమాలు తీయడానికి లేదు. కంటెంట్ నచ్చితేనే వాళ్లైనా చేయూతనిచ్చేది. కాబట్టి కంటెంట్ లో క్వాలిటీ ఉంటె విడుదలకు ఇబ్బందులు పడుతున్న దర్శక నిర్మాతలకు సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఒకవేళ అనూహ్యమైన ఫలితాలు వస్తే వాటి పూర్తి ఫలాలు దక్కినా దక్కపోయినా ఇంకో సినిమా తీయాడానికి ఈ కొత్త నిర్మాతలకు ధైర్యం వస్తుంది. గీత సురేష్ లాంటి పెద్ద సంస్థలే రిస్క్ తగ్గించుకోవడం కోసం ఇతర నిర్మాతలతో టై అప్ అవుతుంటే ఇక కొత్త ప్రొడ్యూసర్ల గురించి చెప్పేదేముంది

    
    
    

Tags:    
  • Suresh Production 
  • Suresh Babu 
  • Allu Aravind 
  • Geetha Arts 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS