బిబి3 జాబితాలో మరో ముద్దుగుమ్మ

Update: 2020-11-09 23:30 GMT
బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా హీరోయిన్‌ విషయమై చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పది మంది హీరోయిన్స్‌ పేర్లు ఈ సినిమా విషయమై ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు అధికారికంగా హీరోయిన్‌ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మళ్లీ హీరోయిన్‌ విషయమై చర్చనీయాంశం అయ్యింది. మలయాళి ముద్దుగుమ్మ పూర్ణ ఒక హీరోయిన్‌ గా ఎంపిక అయినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్‌ ను కూడా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

కంచె ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ ను బాలయ్యకు జోడీగా మరో హీరోయిన్‌ గా ఎంపిక చేశారట. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు పొందలేక పోయింది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హాట్‌ హాట్‌ ఫొటో షూట్‌ లు షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ప్రగ్యా జైస్వాల్‌ కు బోయపాటి ఛాన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ అమ్మడు ప్రస్తుతం హిందీలో ఒక ప్రాజెక్ట్‌ చేస్తుందట. ఈసమయంలో బాలయ్యకు జోడీగా చేసే అవకాశం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది చూడాలి. బాలయ్యకు జోడీ గా బిబి3 లో నటించబోతున్న హీరోయిన్స్‌ ఎవరు అనే విషయమై నందమూరి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించి బోయపాటి హీరోయిన్స్‌ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందేమో చూడాలి.
Tags:    

Similar News